Pakistan : ప్రస్తుతం పాకిస్తాన్ దేశంతో జరుగుతున్న అనధికారిక యుద్ధంలో మన దేశ సైన్యానికి ప్రతి ఒక్కరూ సంఘీభావంగా నిలుస్తున్నారు. తోడ్పాటు అందిస్తున్నారు. అండగా మేముంటామని భరోసా ఇస్తున్నారు.. సామాజిక మాధ్యమాలలో.. దేశ సైన్యాన్ని కీర్తిస్తూ పోస్టులు పెడుతున్నారు. మన దేశ శౌర్యాన్ని, ధైర్యాన్ని, పరాక్రమాన్ని మరింతగా విస్తరించాలని.. కోరుతున్నారు. శత్రుదేశంపై ఏమాత్రం వెనకడుగు వేయొద్దని.. వెన్ను చూపించకుండా పోరాడాలని హితవు పలుకుతున్నారు. అంతేకాదు దాయాది దేశంపై మరోసారి విజయం సాధించి.. భారత విజయ గర్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని కోరుతున్నారు..
Also Read : పాక్ తో ఉద్రిక్తతలు.. ఐపీఎల్ మ్యాచ్ వేదిక మార్పు
చాలా చోట్ల నిరసనలు
పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ అంటే చాలు భారతీయులు మండిపడుతున్నారు. పాకిస్తాన్ ప్రస్తావన వస్తే చాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవకాశం ఇస్తే పాకిస్తాన్ దేశానికి చుక్కలు చూపించడానికి రెడీగా ఉన్నారు. అలాంటివారిలో ఓ బుడ్డోడు కూడా ఉన్నాడు. పట్టరాని ఆగ్రహంతో.. తట్టుకోలేని ఆవేశంతో అతడు చేసిన పని ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది.. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ దేశానికి చెందిన జాతీయ జెండాలను రోడ్డుమీద వేసి.. చాలామంది నిరసనలు తెలుపుతున్నారు. కాళ్లతో తంతు తగలబెడుతున్నారు. ఇక హైదరాబాదులోని దిల్ షుక్ నగర్ లో రోడ్డుమీద పాకిస్తాన్ జెండాను అంటించిన యువకులు.. తొక్కుకుంటూ వెళ్లిపోయారు.. అయితే అదే సమయంలో ఓ బుడ్డోడు మాత్రం.. పాకిస్తాన్ జాతీయ జెండాను చూడగానే ఆగ్రహంతో ఊగిపోయాడు. తనకాళ్లతో ఎగిరెగిరి ఆ జెండాను తొక్కాడు. తనకున్న కోపాన్ని ప్రదర్శించాడు.. పాకిస్తాన్ దేశాన్ని బండ బూతులు తిట్టాడు. అతడి వాలకాన్ని చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అతడు చేస్తున్న పనిని తమ ఫోన్లలో రికార్డు చేసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. ” బాబోయ్ ఆ బాలుడు ఏంటి అంత ఆగ్రహం గా ఉన్నాడు.. అవకాశం దొరికితే చాలు పాకిస్తాన్ దేశాన్ని తుక్కుతుక్కు చేసే విధంగా ఉన్నాడు. దేశమంటే ఎంత ప్రేమ ఉంటే ఇంతటి ఆగ్రహాన్ని ప్రదర్శించాలి.. ఇలాంటి ప్రజలు ఉన్నారు కాబట్టే భారతదేశం ప్రపంచంలో భిన్నంగా కనిపిస్తోంది. ఆపద ఎదురైతే చాలు అంతా ఒక్కటవుతున్నది. అందుకే భిన్నత్వంలో ఏకత్వం అనే సామెత భారతదేశాన్ని ఉదహరిస్తూ ఎందుకు చెబుతారు అంటే ఇందుకేనని” నెటిజన్లు పేర్కొంటున్నారు. కాగా, ఫహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్ పై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఉగ్రవాదులకు స్థావరంగా మారిన ఆదేశంపై అన్ని దేశాల చెందిన ప్రజలు మండిపడుతున్నారు. ఇలాంటి భావాలు ఉన్న దేశం ప్రపంచానికే పెను ప్రమాదం అని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ ఇప్పటికైనా తన తీరు మార్చుకోవాలని సూచనలు చేస్తున్నారు. లేనిపక్షంలో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
Also Read : పాకిస్తాన్ ప్రతీకార దాడులకి పాల్పడితే జరిగేదేంటి?