Homeజాతీయ వార్తలుWalkie Talkie Sale Ban : భారత్-పాక్ టెన్షన్.. ఆన్‌లైన్ వాకీ-టాకీల అమ్మకాలపై కేంద్రం కొరడా!

Walkie Talkie Sale Ban : భారత్-పాక్ టెన్షన్.. ఆన్‌లైన్ వాకీ-టాకీల అమ్మకాలపై కేంద్రం కొరడా!

Walkie Talkie Sale Ban : భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ఆన్‌లైన్ వాకీ టాకీల అమ్మకాల మీద కఠిన చర్యలు తీసుకుంది.ప్రభుత్వం అనేక ఈ కామర్స్ వెబ్‌సైట్‌లకు నోటీసులు పంపి, అటువంటి పరికరాల అమ్మకాలను నిలిపివేయాలని ఆదేశించింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లపై అందుబాటులో ఉన్న వాకీ-టాకీల అమ్మకాలపై నిషేధం విధించింది.

ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా భారత్ ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించింది. దీని తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే CCPA భద్రతాపరమైన ముప్పును దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లపై వాకీ టాకీ పరికరాల అమ్మకాలను నిలిపివేసింది. లైసెన్స్ లేకుండా వాకీ టాకీ వంటి వాటిని విక్రయిస్తున్నారని, ఇది వైర్‌లెస్ కమ్యూనికేషన్ నిబంధనలకు విరుద్ధమని CCPA తెలిపింది. ఈ పరికరాలు సులభంగా ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది.దీనివల్ల జాతీయ భద్రతకు నష్టం వాటిల్లవచ్చు. ముఖ్యం భారత్-పాక్ సరిహద్దులో పెరుగుతున్న ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎటువంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు.

Also Read : ఏపీ భవన్ లో కంట్రోల్ రూమ్.. ఆ నంబర్లకు సంప్రదించవచ్చు!

నివేదికల ప్రకారం.. కొన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లపై వాకీ టాకీలు ఎటువంటి ధృవీకరణ లేకుండా అమ్ముతున్నాయి. అటువంటి ప్లాట్‌ఫారమ్‌లు వెంటనే ఈ ఉత్పత్తులను తొలగించాలని, భవిష్యత్తులో అనుమతి లేకుండా విక్రయించవద్దని CCPA ఆదేశించింది. అలాగే, చట్టవిరుద్ధంగా ఉపయోగించే పరికరాలను కొనుగోలు చేయవద్దని వినియోగదారులను కూడా హెచ్చరించింది. ఈ చర్య భద్రతను బలోపేతం చేయడమే కాకుండా తప్పుడు వ్యక్తులను కూడా కంట్రోల్ చేయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కేంద్ర మంత్రి ప్రకటన
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో పోస్ట్ చేస్తూ ఈ విషయం గురించి సమాచారం ఇచ్చారు. మార్కెట్‌లో అనేక పరికరాలు వాటి ఫ్రీక్వెన్సీ గురించి సమాచారం లేకుండా విక్రయించబడుతున్నాయని ఆయన అన్నారు. వాటికి లైసెన్స్ ఉందా లేదా లైసెన్స్ లేకుండా విక్రయిస్తున్నారా అనే దానిపై స్పష్టమైన సమాచారం లేదని కూడా ఆయన పేర్కొన్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version