Italy: ఏదైనా ప్రమాదం నుంచి బయట పడితే మృత్యుంజయులు అంటారు. కానీ ఆ జంట ఒకేరోజు రెండు ప్రమాదాల నుంచి తప్పించుకుంది. అందులోనూ ఆ రెండు ప్రమాదాలు.. భయానక విమాన ప్రమాదాలు కావడమే విశేషం. ఇటలీకి చెందిన 30 సంవత్సరాల స్టెఫానో పిరెల్లి, అతడి ఫియాన్సీ 22 సంవత్సరాల ఆంటోనీయెట్టా డీమాసి స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకలు చేసుకోవాలని భావించారు. వేర్వేరు ప్రాంతాల నుంచి విమానాల్లో బయలుదేరారు.
స్టేఫానియో రెండు సీట్ల విమానంలో బయలుదేరగా.. సాంకేతిక సమస్య తలెత్తి అది కూలిపోయింది. కానీ స్టేఫానియోకు ఎటువంటి గాయాలు తగల్లేదు. దురదృష్టం ఏమిటంటే అక్కడకు 25 మైళ్ళ దూరంలో ఆంటోనీయెట్టా ఎక్కిన వేరొక రెండు సీట్లు విమానం కూడా కూలిపోయింది. ఆ ఘటనలో సైతం స్వల్ప గాయాలతో అంటోనియెట్టా బయటపడ్డారు. ఇద్దరూ మృత్యుంజయులుగా నిలిచారు.
ఏదైనా పెట్టి పుట్టుండాలి అన్న నానుడిని నిజం చేశారు. ఈ ప్రమాదంలో ఆంటోనీయెట్టా పైలట్కు తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఆరోజు ఉదయం అందంగా మొదలై.. విషాదంగా ముగిసిందని ఆ జంట ఆవేదన వ్యక్తం చేస్తుంది. కానీ ప్రమాదం నుంచి బయటపడటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదం జరగకపోవడంతో ఇరు కుటుంబాల వారితో పాటు స్నేహితులు ఊపిరి పీల్చుకున్నారు. క్రిస్మస్ వేడుకలను అత్యంత భక్తితో నిర్వహించుకోవాలని డిసైడ్ అయ్యారు. కాగా మృత్యుంజయులుగా నిలిచిన ఆ జంటకు నెటిజెన్లు అభినందనలు తెలుపుతున్నారు. పునర్జన్మ సిద్ధించిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.