Salaar: సలార్ తో ప్రభాస్ బాక్సాఫీస్ షేక్ చేశాడు. వరల్డ్ వైడ్ ఫస్ట్ డే సలార్ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. 2023కి గాను హైయెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ రాబట్టింది. సలార్ వరల్డ్ వైడ్ రూ. 178.7 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్ విడుదల చేశారు. నిజానికి సలార్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రభాస్ మాస్ అవతార్, యాక్షన్ ఎపిసోడ్స్ మెస్మరైజ్ చేశాయి. అయితే కథ ఎమోషనల్ గా కనెక్ట్ కాలేదని క్రిటిక్స్ అభిప్రాయపడ్డారు.
అవేమీ సలార్ బాక్సాఫీస్ సునామీని ఆపే సూచనలు కనిపించడం లేదు. కాగా సలార్ మూవీకి సంబంధించిన ఒక ఆసక్తికర సమాచారం తెరపైకి వచ్చింది. ప్రకటన నాటి నుండే సినిమా టైటిల్ విషయంలో అయోమయం చోటు చేసుకుంది. సలార్ అంటే ఏమిటో ఎవరికీ తెలియదు. చాలా మంది సలార్ అంటే పేరు. ఈ చిత్రంలో ప్రభాస్ పేరు సలార్ అని భావించారు. కానీ నిజం అది కాదు.
సలార్ ఒక ఉర్దూ పదం. దాని మీనింగ్ నాయకుడు. సమర్థతతో కూడిన బలమైన నాయకుడిని సలార్ అంటారు. ప్రభాస్ క్యారెక్టరైజేషన్ కి సెట్ అయ్యేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆ ఉర్దూ పదాన్ని పట్టుకొచ్చాడు. సౌండింగ్ కూడా మాస్ అండ్ పవర్ ఫుల్ గా ఉంది. సలార్ టైటిల్ వెనకున్న అసలు కథ అదన్నమాట. కెజిఎఫ్ లో మాదిరి ప్రశాంత్ నీల్ సలార్ లో కూడా ఒక కల్పిత ప్రాంతాన్ని సృష్టించాడు.
ఖాన్సార్ అనే సామ్రాజ్యం పై నడిచే ఆధిపత్య పోరే ఈ చిత్ర కథ. దాన్ని ఇద్దరు మిత్రుల కోణంలో చెప్పారు. ప్రభాస్-పృథ్విరాజ్ ఆ మిత్రులుగా నటించారు. సలార్ పార్ట్ 2 కూడా ఉంది. అసలు కథ అంతా… పార్ట్ 2 కోసం దాచి ఉంచారు. పార్ట్ 1 లో సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. జగపతిబాబు, బాబీ సింహ, ఈశ్వరి రావు కీలక రోల్స్ చేశారు.