Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ ని మరోస్థాయికి తీసుకెళ్లిన సినిమా ‘ఖుషి’..అప్పటి వరుకు కేవలం నలుగురు స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగిన పవన్ కళ్యాణ్, ఈ చిత్రం తో నెంబర్ 1 హీరో గా ఎదిగాడు..అప్పట్లో నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘నరసింహ నాయుడు’ చిత్రం మొట్టమొదటి 20 కోట్ల రూపాయిల షేర్ సాధించిన చిత్రం గా సరికొత్త చరిత్ర సృష్టిస్తే.

అదే సంవత్సరం లో నాలుగు నెలలు గడవకముందే ఒక మోడరన్ లవ్ స్టోరీ అయినా ఖుషి తో నరసింహ నాయుడు కలెక్షన్స్ రికార్డుని బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ ని అందుకున్నాడు పవన్ కళ్యాణ్..ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ ఇచ్చిందంటే పది సంవత్సరాలు సరైన హిట్ లేకపోయినా కూడా ఒకే రకమైన క్రేజ్ ని మైంటైన్ చేసేంత రేంజ్ ని ఆయనకీ ఇచ్చింది..అలాంటి చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 26 వ తేదీ..అనగా ఖుషి ఒరిజినల్ రిలీజ్ తేదీన విడుదల చెయ్యడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రాన్ని 4K వెర్షన్ కి మార్చేశామని..సరైన విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్నామని ఆ చిత్ర నిర్మాత AM రత్నం అప్పట్లో ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు..ముందుగా ఈ సినిమాని డిసెంబర్ 30 వ తేదీన విడుదల చేద్దాం అనుకున్నారు..కానీ ఆ రోజున బద్రి సినిమాని గ్రాండ్ గా రీ రిలీజ్ చెయ్యాలని ఫాన్స్ తలపించడం తో ఖుషి ని వచ్చే ఏడాది 26 వ తేదీన విడుదల చెయ్యాలని రత్నం ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది..కానీ అదే రోజు ఆయన పవన్ కళ్యాణ్ తో ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం కూడా విడుదల అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

అంటే రెండు పవన్ కళ్యాణ్ సినిమాలు ఒకేరోజు విడుదల అవుతున్నాయా..హరి హర వీరమల్లు తో పాటు విడుదల చేస్తే ఖుషి సినిమాని ఎవ్వరూ చూడరు..కాబట్టి ఖుషి సినిమాని వచ్చే ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు ప్లాన్ చెయ్యండి అంటూ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ AM రత్నం ని ట్యాగ్ చేసి డిమాండ్ చేస్తున్నారు.