Chiranjeevi – Balakrishna Multistarrer: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మాస్ హీరోలు గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోలు ఎవరు అంటే మన అందరికి టక్కుమని గుర్తుకువచ్చే పేర్లు మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ..ఒకానొక సమయం లో నువ్వు చిరంజీవి ఫ్యాన్ వా, లేదా బాలయ్య బాబు ఫ్యాన్ వా అని అడిగేవారు..అప్పట్లో వీళ్లిద్దరికీ ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది..వీళ్ళ సినిమాలు విడుదల అయ్యాయంటే చాలు థియేటర్స్ వద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది.

అంతే కాకుండా వీళ్లిద్దరి సినిమాలు ఒకరోజు గ్యాప్ తో విడుదలైనవి కూడా ఎన్నో ఉన్నాయి..కొన్ని సార్లు బాలయ్య బాబు చిరంజీవి మీద పైచెయ్యి సాధిస్తే..మరికొన్ని సార్లు చిరంజీవి బాలయ్య మీద పై చెయ్యి సాధించేవాడు..అలా వీళ్లిద్దరి మధ్య నువ్వా నేనా అనే రేంజ్ లో పోటీ వాతావరణం ఉండేది..ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ ఇద్దరు హీరోలు ‘వాల్తేరు వీరయ్య’ మరియు ‘వీర సింహా రెడ్డి’ చిత్రాలతో సంక్రాంతి పోరులో తలపడబోతున్న సంగతి తెలిసిందే.
ఇది ఇలా ఉండగా బాలయ్య బాబు ఆహా మీడియా లో ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ ప్రోగ్రాం చేస్తున్న సంగతి తెలిసిందే..సీజన్ 1 బంపర్ హిట్ అవ్వగా, సీజన్ 2 కూడా దిగ్విజయం గా కొనసాగుతుంది..ఇక ఈ వారం 5 వ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది..ఈ 5 వ ఎపిసోడ్ లో ముఖ్య అతిధులుగా ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ మరియు సురేష్ బాబు హాజరవుతారు..ఈ సందర్భంగా బాలయ్య బాబు మాట్లాడుతూ ‘సురేష్ బాబు తో నేను అప్పట్లో కొన్ని సినిమాలు చేశాను..మన కాంబినేషన్ లోనే ఒక సినిమా బ్యాలన్స్ పడింది’ అంటూ అల్లు అరవింద్ తో అంటాడు.

అప్పుడు అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘నేను మిమల్ని మరియు చిరంజీవి గారిని పెట్టి మల్టీస్టార్ర్ర్ మూవీ ని ప్లాన్ చెయ్యడానికి ఎదురు చూస్తున్నాను’ అని అంటాడు..అప్పుడు బాలయ్య బాబు దానికి సమాధానం ఇస్తూ ‘అప్పుడు అది పాన్ వరల్డ్ సినిమా అవుతుంది’ అని సమాధానమిస్తాడు..ప్రస్తుతం మల్టీస్టార్ర్ర్ ట్రెండ్ టాలీవుడ్ లో గట్టిగా నడుస్తుండడం వల్ల ఈ క్రేజీ మల్టీస్టార్ర్ర్ ని కూడా భవిష్యత్తులో ఊహించొచ్చు అని విశ్లేషకులు అంటున్నారు.