Anasuya Bharadwaj- Allu Arjun: పుష్ప అల్లు అర్జున్ కెరీర్ లో స్పెషల్ మూవీ. ఆయనకు పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిన చిత్రం ఇది. అందుకే దర్శకుడు సుకుమార్ ని అల్లు అర్జున్ ఆకాశానికి ఎత్తుతున్నారు. నా కెరీర్ మలుపు తిప్పిన దర్శకుడు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. బన్నీ కెరీర్లో కీలకమైన రెండు విజయాలు సుకుమార్ డైరెక్షన్ లోనే రావడం విశేషం. అల్లు అర్జున్ డెబ్యూ మూవీ గంగోత్రి. ఆ మూవీలో అల్లు అర్జున్ లుక్స్ విమర్శలపాలయ్యాయి. మూవీ కూడా చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. అలాంటి బన్నీని సుకుమార్ ఆర్య చిత్రంలో సరికొత్తగా చూపించాడు. ఆర్యలో అల్లు అర్జున్ డాన్సులకు యువత ఊగిపోయారు.

అల్లు అర్జున్ ని పరిశ్రమలో నిలబెట్టిన చిత్రంగా ఆర్యను చెప్పుకోవచ్చు. ఇక పుష్ప మూవీ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చింది. పుష్ప పార్ట్ 1 రూ. 360 కోట్ల వరల్డ్ వైడ్ వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలో పార్ట్ 2 భారీగా ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2 బడ్జెట్ రూ. 300 కోట్లకు పైమాటే అని సమాచారం. అన్ని విషయాల్లో పార్ట్ 1 కి మించి పార్ట్ 2 ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే అనసూయను రెండు విధాలుగా వాడేసేలా సుకుమార్-అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నారట.
పుష్ప మూవీలో సమంత చేసిన ”ఊ అంటావా మామా” ఓ సెన్సేషన్. షార్ట్ ఫ్రాక్ లో ఆమె చేసిన బోల్డ్ స్టెప్స్ మెస్మరైజ్ చేశాయి. పుష్ప 2 లో కూడా ఓ ఐటెం సాంగ్ ఉంటుందట. ఈ సాంగ్ ని అనసూయతో అనుకుంటున్నారట. మరింత బోల్డ్ గా అనసూయపై ఐటెం నెంబర్ తెరకెక్కించనున్నారట. ఈ మేరకు ఆమెతో చర్చలు కూడా జరిపారట. రెమ్యునరేషన్ భారీగా ముట్టజెబుతున్నారట. దీంతో అనసూయ యస్ చెప్పారట. పుష్ప 2 లో దాక్షాయణిగా అనసూయ విలన్ రోల్ చేస్తున్నారు. ఆమె డీగ్లామర్ రోల్ ని పాలిష్ చేసి ఐటెం నంబర్ ప్లాన్ చేస్తున్నారనేది తాజా సమాచారం.

దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ పరిశ్రమలో ప్రచారం అవుతుంది. కార్తికేయ హీరోగా తెరకెక్కిన చావు కబరు చల్లగా మూవీలో అనసూయ ఐటెం నంబర్ చేశారు. ఆ మూవీ అనుకున్న స్థాయిలో ఆడలేదు. దీంతో అనసూయ ఐటెం భామగా వెలుగులోకి రాలేదు. నిజంగా సుకుమార్ ఆమెపై హాట్ సాంగ్ చేస్తే అది అనసూయ కెరీర్ కి కూడా ప్లస్ అవుతుంది. ఇక టెలివిజన్ షోస్ కూడా మానేసిన అనసూయ నటిగా ఫుల్ ఫోకస్ సినిమాలపై పెట్టింది.