India vs Sri Lanka: టీమిండియా బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ కోల్పోయినా టెస్ట్ లో మాత్రం విశ్వరూపం చూపించింది. బంగ్లాను 2-0 తో చిత్తు చేసి సిరీస్ సొంతం చేసుకుంది. ఏమరుపాటుగా ఉన్నందుకు వన్డే సిరీస్ చేజార్చుకుంది. కానీ టెస్ట్ ను జారవిడుచుకోకుండా జాగ్రత్త పడింది. ఫలితంగా బంగ్లాను బురిడీ కొట్టించింది. రెండు మ్యాచ్ ల సిరీస్ లో అన్నింట్లో ఆధిపత్యం వహించి తామేమిటో నిరూపించుకుంది. ఈ నేపథ్యంలో జనవరి 3 నుంచి శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. దీనికి బీసీసీఐ ఇంకా ఆటగాళ్లను ఎంపిక చేయలేదు. దీంతో ఇప్పుడు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ భవితవ్యంపై నీడ పడుతోంది.

శ్రీలంకతో జరిగే మూడు టీ20 సిరీస్ లో ఓపెనర్ కేఎల్ రాహుల్ మనుగడ ప్రశ్నార్థకం కానుంది. ఈ సారి రాహుల్ ను తప్పిస్తారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రతి మ్యాచ్ లోనూ రాహుల్ పేలవ ప్రదర్శన కారణంగానే రాహుల్ మెడపై కత్త వేలాడుతోంది. ఇతడిని తప్పించేందుకే బీసీసీఐ నిర్ణయించుకుందని వార్తలు వస్తున్నాయి. కేఎల్ రాహుల్ ప్రదర్శన సమస్యగా మారుతోంది. టెస్ట్ సిరీస్ లోనూ ఫామ్ కొనసాగించలేదు. మూడు ఫార్మాట్లలోనూ అతడి సగటు 30 మించలేదంటే అతిశయోక్తి కాదు.
రాహుల్ ను తొలగించి అతడి స్థానంలో ఇషాన్ కిషన్ ను జట్టులోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ తో జరిగిన మూడు వన్డేల్లో అతడు డబుల్ సెంచరీ సాధించడంతో జట్టు యాజమాన్యం కిషన్ వైపు చూస్తోంది. టెస్ట్ క్రికెట్లో రాహుల్ నాలుగు మ్యాులు ఆడిన ఎనిమిది ఇన్నింగ్స్ లలో 17.12 సగటుతో 137 పరుగులు చేయడం గమనార్హం. ఇందులో ఒక అర్థ సెంచరీ చేశాడు. పది వన్డేలలో తొమ్మిది ఇన్నింగ్స్ లలో 27.88 సగటుతో 251 పరుగులు చేశాడు. కేవలం రెండు అర్థ సెంచరీలు మాత్రమే చేశాడు.

రాహుల్ కెప్టెన్సీలో బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ మాత్రం కైవసం చేసుకుంది. అంతకుముందు బంగ్లాతో ఆడిన వన్డే సిరీస్ ను దూరం చేసుకుంది. ఇలా రాహుల్ పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తున్నాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోవడం లేదు. అందుకే రాహుల్ ను తప్పించి అతడి స్థానంలో మరో స్టార్ బ్యాట్స్ మెన్ ఇషాన్ కిషన్ ను చేర్చుకోవాలని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుంది. అద్భుత ప్రదర్శన చేస్తాడని ఆశించిన ప్రతిసారి నిరాశే మిగుల్చుతున్నాడు. దీంతో అతడిని తప్పించాలనే భావనలో టీం మేనేజ్ మెంట్ ఉందని చెబుతున్నారు.