Homeట్రెండింగ్ న్యూస్Karimnagar Missing Case: ఫ్రీ బస్సు నచ్చింది.. బడికెళ్లి చదువుకోవడం నచ్చలే! కరీంనగర్ బాలికకేసులో...

Karimnagar Missing Case: ఫ్రీ బస్సు నచ్చింది.. బడికెళ్లి చదువుకోవడం నచ్చలే! కరీంనగర్ బాలికకేసులో ఊహించని ట్విస్ట్

Karimnagar Missing Case: కరీంనగర్‌లో బాలిక అదృశ్యం మిస్టరీని పోలీసులు ఛేదించారు. బుధవారం బైపాస్‌ రోడ్డులో బస్సు దిగిన బాలిక తర్వాత కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్‌ రూరల్‌ పోలీసుల ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించారు. రెండు రోజుల వ్యవధిలో బాలికను గుర్తించారు. హైదరాబాద్‌ బస్టాండ్‌లో బాలికను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.

ఏం జరిగిందంటే..
కరీంనగర్‌ జిల్లాలో కలకలం చేపిన 13 ఏళ్ల బాలిక వశిష్ట రెండు రోజుల క్రితం నగరం శివారులోని బైపాస్‌లో అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో అలర్ట్‌ అయిన కరీంనగర్‌ పోలీసులు చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. హెదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌లో కనుగొన్నారు. అక్కడ వశిష్టను అక్కున చేర్చుకున్నారు. చిన్నారి భయంతో ఉండడంతో తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్తామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వశిష్ట అమ్మ కావాలని ఏడవడం మొదలు పెట్టింది. దీంతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌కు తీసుకు వచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో వశిష్ట మిస్సింగ్‌ కథ సుఖాంతమైంది.

చదువుకోవడం ఇష్టం లేక..
అయితే కరీంనగర్‌ ౖ»ñ పాస్‌లో మిస్‌ అయిన వశిష్ట అసలు హైదరాబాద్‌కు ఎందుకు వెళ్లింది అనేది ప్రశ్నార్థకంగా మారింది. చిన్నారిని ఎవరైనా తీసుకెళ్లారా.. లేక తెలియకుండానే ఆమె బస్సు ఎక్కి వెళ్లిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం మిస్‌ అయిన వశిష్ట రెండు రోజులు ఎక్కడ ఉంది అన్నది తెలియాల్సి ఉంది. రెండు రోజులు ఎలా గడిపింది అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వశిష్ట భయపడుతుండడంతో ఏమీ అడగలేకపోయారు. తర్వాత నిదానంగా ఆరా తీశారు. ఆమె పాఠశాలకు వెళ్లకుండా హైదరాబాద్‌ వెళ్లడానికి వశిష్ట చెప్పిన కారణం విని షాక్‌ అయ్యారు. చదువుకోవడం ఇష్టంలేక, ప్రీ బస్సు నచ్చడంతో హైదరాబాద్‌కు వెళ్లినట్లు వశిష్ట తెలిపింది. ఈమేరకు చిన్నారి హైదరాబాద్‌ బస్టాండ్‌లో తిరుగుతున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈమేరకు ఆ దృశ్యాన్ని సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. తల్లిదండ్రులు పిల్లల మనసు ఎరిగి నడుచుకోవాలని, తరచూ గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version