TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తుల కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటోంది. డిసెంబర్ 1 నుంచి వీఐపీ దర్శనాల సమయాలను మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు పలు తీర్మానాలు ఆమోదించింది. నెల రోజుల పాటు ఉదయం 8 గంటలకే బ్రేక్ దర్శనాలు ప్రారంభించాలని చూస్తోంది. ఇది పరిశీలనాత్మకంగానే చేపడుతోంది. ఈ నిర్ణయం సక్సెస్ అయితే కొనసాగించాలని భావిస్తోంది. తిరుపతికి వెళ్లాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్తే. భక్తుల కష్టాలు తీర్చేందుకే టీటీడీ ఇలా నిర్ణయం తీసుకుంది.

స్వామి వారి దర్శనం భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే టీటీడీ ఆలోచిస్తోంది. ఇందులో భాగంగానే వీఐపీ బ్రేక్ దర్శనాల వల్ల సామాన్య భక్తులకు తిప్పలు తప్పడం లేదు. వీఐపీలు వచ్చి వెళ్లిపోయే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి. దీంతోనే టీటీడీ కొన్ని మార్పులకు శ్రీకారం చుడుతోంది. ప్రయోగాత్మకంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని తాపత్రయపడుతోంది. సామాన్య భక్తుల కష్టాలు పరిగణనలోకి తీసుకుని పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం వీఐపీ బ్రేక్ దర్శనాలు సోమవారం ఉదయం 5 గంటల నుంచి 5.45 వరకు నిర్వహిస్తున్నారు. మంగళ, బుధ, గురు వారాలలో 6.30 నుంచి 7 గంటల వరకు, శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 8.30 వరకు, శని, ఆది వారాల్లో ఉదయం 5 నుంచి 5.30 గంటల వరకు చేస్తున్నారు. దీంతో టీటీడీ ఇక మీదట అన్ని రోజుల్లో ఉదయం 8 గంటలకే నిర్వహించి సామాన్య భక్తులకు ముందుగానే స్వామి వారి దర్శన భాగ్యం కలిగించాలని చర్యలు చేపడుతోంది.

టీటీడీ తీసుకున్న నిర్ణయం భక్తులకు మంచి ప్రయోజనాలు కలిగించనుంది. భక్తులు దేవుడిని సక్రమంగా దర్శించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలకు ఉపక్రమించడం నిజంగా శుభ పరిణామమే. దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు. వారి దర్శనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయడానికే టీటీడీ ఈ మేరకు నిర్ణయించింది. దీని కోసం వీఐపీ దర్శనాల సమయంలో మార్పులు చేసి సామాన్య భక్తులకు ఊరట కలిగించనుంది. సరైన సమయంలో దేవుడిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకోవడానికి అవకాశాలు కల్పిస్తోంది.