Zodiac signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు కాలక్రమంగా రాశులు మారుతూ ఉంటాయి. అయితే ఇలాంటి సమయంలో కొన్ని గ్రహాలు ఒకే కక్షలో పయనిస్తూ ఉంటాయి. మరికొన్ని గ్రహాలు వ్యతిరేక దిశలో సాగుతూ ఉంటాయి. గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో.. తిరోగమనం అయినప్పుడు కూడా కొన్ని రాశులపై ప్రభావం పడి అధిక ప్రయోజనాలు కలుగుతాయి. జూలైలో శని, బుధ గ్రహాలు తిరోగమనం చేయనున్నాయి. కర్మ ఫలదాత అయిన శని.. చల్లని గ్రహంగా పేర్కొనే బుధుడు రెండు తిరోగమరంలో ఉండడంతో కొన్ని రాశులపై ప్రభావం పడి అధిక ప్రయోజనాలు ఉండలు ఉన్నాయి. జూన్ 22న బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేసి అదే రోజు తిరుగమనం ప్రారంభిస్తాడు. అలాగే జులై 13వ తేదీన శని మీన రాశిలోకి ప్రవేశించి నవంబర్ 15వ తేదీ వరకు తిరోగమనం సాగిస్తాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏ గ్రహాలపై ప్రభావం పడుతుందో ఇప్పుడు చూద్దాం..
Also Read : ఒకే రాశిలోకి చంద్రుడు, బుధుడు.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
రెండు గ్రహాలు తిరోగమనం చేయడం వల్ల వృషభ రాశిపై ప్రభావం పడుతుంది. ఈ రాశిలో మూడవ స్థానంలో బుధుడు.. 11వ స్థానంలో శని తీరో గమనం చేయనున్నారు. దీంతో ఈ రాశి వారికి కలిసి వస్తుంది. వీరు కొత్తగా ఏ పని ప్రారంభించిన విజయవంతంగా పూర్తి చేస్తారు. గతంలో చేపట్టిన పనులు ఆటంకాలు లేకుండా సాగుతాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
శని, బుధ గ్రహాల తిరోగమనం వల్ల మిథున రాశి వారి పై ప్రభావం పడనుంది. ఈ రాశి వారికి బుధుడు 12వ ఇంట్లో తిరోగమనం చేయనున్నాడు. దీంతో ఈ రాశులు కలిగిన వారు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులు కొత్త ఉద్యోగాలను పొందుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. అనారోగ్యం నుంచి బయటపడతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. పెండింగ్లో ఉన్న డబ్బు వసూలు అవుతుంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
కర్కాటక రాశి వారికి శని, బుధ గ్రహాల తిరోగమనం వల్ల కలిసి రానుంది. బుధుడు ఏ రాశిలోనే తిరోగమనం చేయడం ప్రారంభించినందువలన ఈ రాశి వారికి అనేక రకాలుగా కలిసి వస్తుంది. ఆర్థికంగా అధిక ప్రయోజనాలు పొందనున్నారు. ఆకస్మికంగా ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. కొత్తగా ప్రాజెక్టులు చేపడతారు. వ్యాపారులకు లాభాలు అధికంగా ఉండలు ఉన్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రయోజనాలు పొందుతారు.
ఇలా రెండు గ్రహాల తిరోగమనం వల్ల మూడు రాశుల వారికి గతంలో లేనంతగా అధిక ప్రయోజనాలు ఉండనున్నాయి. అయితే కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు మాటలను అదుపులో ఉంచుకోవాలి. దూర ప్రయాణాలు చేసే సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు.