Singer Sunitha: ఉన్న మాటంటే ఉలుకెందుకు అన్నట్లు… సునీతను రెండో పెళ్లి గురించి అడిగితే మండిపడుతుంది. తాజా ఇంటర్వ్యూలో యాంకర్ పై ఈ స్టార్ సింగర్ విరుచుకుపడ్డారు. సునీత సెకండ్ మ్యారేజ్ అప్పట్లో ఓ సెన్సేషన్. పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లలున్న సునీత మరో వివాహం చేసుకుంటారని ఎవరూ ఊహించలేదు. ఆమె నిశ్చితార్థం ఫోటోలు బయటికి రావడంతో అభిమానులు షాక్ అయ్యారు. మీడియా అధినేత రామ్ ని వివాహం చేసుకుంటున్నట్లు సునీత ప్రకటించారు. సునీత చర్యను చాలా మంది తప్పుబట్టారు. 42 ఏళ్ల వయసులో మళ్ళీ పెళ్లా!… అంటూ ప్రశ్నించారు. ట్రోల్ చేశారు.

సదరు విమర్శలకు సునీత సమాధానం చెప్పారు. పిల్లలు, తన భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని కుటుంబ సభ్యుల మద్దతుతో ఈ వివాహం చేసుకుంటున్నాను. దయచేసి నాకు అండగా నిలిచి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నానని విజ్ఞప్తి చేశారు. ఇండస్ట్రీలో ఉన్న సునీత సన్నిహితులు బయటివారి విమర్శలను తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు. ఆమెకు పూర్తి మద్దతు ప్రకటించారు. 2021 జనవరిలో సునీత-రామ్ వివాహం ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది.
సునీత లైఫ్ రామ్ తో వివాహానికి ముందు తర్వాత అన్నట్లు మారిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఆర్థిక బాధలన్నీ తొలగి లగ్జరీ లైఫ్ వచ్చింది. ఫార్మ్ హౌస్ లు , విందులు, విహారాలు ఒకటేమిటీ… ఇప్పుడు ఆమె వద్ద అన్నీ ఉన్నాయి. ఆ ఎనర్జీతో టీవీ షోలు చేస్తున్నారు. కెరీర్ పరంగా కూడా దెబ్బకు సెట్ అయ్యారు. అయితే సునీత తన పర్సనల్ లైఫ్ గురించి ఎవరైనా విమర్శిస్తే ఊరుకోరు. సోషల్ మీడియాలో నెటిజెన్స్ చేసే కామెంట్స్ ని కూడా తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తారు.

తాజాగా సునీత ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. 42 ఏళ్ల వయసులో రెండో వివాహం చేసుకోవడం పై అనేక విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలను మీరు ఎలా తీసుకుంటారని అడిగారు. ఆ ప్రశ్నకు సునీత ఫైర్ అయ్యారు. నేను దాదాపు 120 మంది హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పాను. వందల పాటలు పాడి ఎంటర్టైన్ చేశాను. ఇలాంటి మంచి విషయాల గురించి మాట్లాడుకోకుండా రెండో పెళ్లి గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు. అది నా పర్సనల్ విషయం. సంస్కారవంతుల లక్షణం ఏమిటంటే… ఎదుటివారిని ఒక మాట అనే ముందు బాధపడతారేమో అని ఆలోచిస్తారు.. అని విరుచుకుపడ్డారు. సునీత కామెంట్స్ కి సంబంధించిన ఈ వీడియో వైరల్ అవుతుంది.