RRR Japanese Release: ఈ ఏడాది దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం అన్ని ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే..అన్ని భాషలకు కలిపి ఈ సినిమా సుమారు 1200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఇండియా లోనే ఆల్ టైం టాప్ 3 హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది..థియేట్రికల్ పరంగా ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో, OTT లో దానికి మించిన రేంజ్ లో సంచలన విజయం సాధించింది..కేవలం ఇండియా లో ఒక సినిమాకి OTT లో అద్భుతమైన రెస్పాన్స్ రావడం కామన్..కానీ ఒక సినిమా కి ప్రపంచం నలుమూలల అందరికి విపరీతంగా నచ్చడం అంటే మాములు విషయం కాదు..#RRR విషయం లో అదే జరిగింది..ఇతర దేశాలలో ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ రావడం తో #RRR టీం ఈ చిత్రాన్ని జపాన్ మరియు చైనా లో విడుదల చెయ్యడానికి సిద్ధం అవుతుంది.

అక్టోబర్ 21 వ తారీఖున ఈ సినిమా జపాన్ లో కనివిని ఎరుగని రేంజ్ లో విడుదల చెయ్యబోతున్నారు..ఇతర దేశాలలో OTT లో అద్భుతమైన రెస్పాన్స్ రావడం తో ఈ సినిమాకి ఇతర దేశాలలో సరైన ప్రొమోషన్స్ చేస్తే థియేట్రికల్ పరంగా ప్రబంజనం సృష్టించడం ఖాయం అని రాజమౌళి గట్టిగ నమ్ముతున్నాడట..అందుకే ప్రొమోషన్స్ విషయం లో ఎక్కడ తగ్గకుండా హీరోలిద్దరిని ఫుల్లుగా వాడేయాలని ఫిక్స్ అయిపోయాడట రాజమౌళి..అక్టోబర్ నెల నుండి డేట్స్ ఖాళీగా ఉంచమని రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కి ఫోన్ చేసి చెప్పాడట..వాళ్ళు కూడా అందుకు ఓకే చెప్పినట్టు సమాచారం.

అంటే అక్టోబర్ నెలలో మరోసారి రామ్ చరణ్ – ఎన్టీఆర్ ని కాంబో గా అభిమానులు చూడబోతున్నారట..ఈ సినిమా ని పాన్ వరల్డ్ రేంజ్ లో తీసుకెళ్తే ఆ తర్వాత మహేష్ బాబు తో చెయ్యబొయ్యే సినిమాని పాన్ ఇండియా గా కాకుండా పాన్ వరల్డ్ గా విడుదల చేద్దామనే ఆలోచనలో ఉన్నాడట రామ్ చరణ్..మరి థియేట్రికల్ బిజినెస్ పరంగా ఈ సినిమా ఇతర దేశాలలో ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి.