Mahesh-Trivikram Movie: టాలీవుడ్ లో కేవలం అభిమానులకు మాత్రమే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా తమ సొంత సినిమాల భావించి ఒక రేంజ్ ఊపు తెచ్చే కాంబినేషన్స్ చాలానే ఉన్నాయి..అలాంటి కాంబినేషన్స్ లో ఒకటే త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబినేషన్..వీళ్లిద్దరి కలయిక లో అతడు మరియు ఖలేజా వంటి సినిమాలు వచ్చాయి..రెండు సినిమాలు కూడా థియేట్రికల్ షేర్ పరంగా గొప్పగా ఏమి వసూళ్లను రాబట్టలేదు..కానీ tv లో టెలికాస్ట్ అయిన తర్వాత వీటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..రెండు సినిమాలు సరిగా ఆడకపోయినా కూడా మహేష్ బాబు అభిమానులు త్రివిక్రమ్ తో సినిమా చేస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు..వాళ్ళ కోరిక ని నెరవేరుస్తూ ఎట్టకేలకు ఈ కాంబినేషన్ మూడవసారి సెట్స్ మీదకి వచ్చింది..ఇటీవలే ఈ కాంబినేషన్ లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకుంది..మహేష్ బాబు కూడా ఎన్నడూ లేని విధంగా సరికొత్త లుక్స్ తో అభిమానులను ఆకట్టుకున్నాడు..మహేష్ బాబు కి వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ఉండడం పైగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్ కావడం తో ఈ సినిమాకి ఇప్పటి నుండే క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి.

కానీ ఈ సినిమాకి వస్తున్న థియేట్రికల్ ఆఫర్లు పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా కంటే తక్కువ ఆఫర్లు వస్తున్నాయనే చెప్పాలి..2018 వ సంవత్సరం లో విడుదలైన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచినా సంగతి మన అందరికి తెలిసిందే..కానీ ప్రీ రిలీజ్ అప్పుడు ఈ సినిమాకి ఉన్న హైప్ మరియు క్రేజ్ వర్ణనాతీతం..టాక్ వస్తే కచ్చితంగా బాహుబలి కలెక్షన్స్ ని కూడా దాటేస్తుంది ఏమో అనే హైప్ ని ఈ సినిమా సృష్టించింది..దానితో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 130 కోట్ల రూపాయలకు జరిగింది..ఇప్పటికి కూడా అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న సినిమాలలో ఒకటిగా అజ్ఞాతవాసి టాప్ 5 లిస్ట్ లో ఉంటుంది..అంత క్రేజ్ ఈ సినిమా సొంతం..అయితే ఆ రేంజ్ క్రేజ్ ని మాత్రం మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ తెచుకోలేకపోతుంది అనే అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ కేవలం 150 కోట్ల రూపాయలకు మాత్రమే జరుగుతుందట..అదేంటి 150 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంటే తక్కువ అంటున్నాడు అని మీరు అనుకోవచ్చు..కానీ 2018 కి 2022 కి మార్కెట్ లో ఎన్నో మార్పులు సంభవించాయి..టికెట్ రేట్స్ కూడా అప్పటి కంటే ఇప్పుడే ఎక్కువ..ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రకారం చూస్తే మహేష్ – త్రివిక్రమ్ లాంటి క్రేజీ కాంబినేషన్ మూవీ కి కనీసం 180 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగాలి..కానీ కేవలం 20 కోట్ల రూపాయిల మార్జిన్ మాత్రమే అయితే అజ్ఞాతవాసి రేంజ్ క్రేజ్ ఈ సినిమాకి దక్కడం లేదనే చెప్పాలి..రాబొయ్యే రోజుల్లో అయిన ఈ సినిమాకి బజ్ పెరిగి ప్రీ రిలీజ్ బిజినెస్ పెరుగుతుందో లేదో చూడాలి.