Variety Business: ట్రోల్‌ ఆఫ్‌ ది డే : ఇదీ యాపారం అంటే.. బట్టలు అమ్మే తీరు ఇదీ

Variety Business: ఏ యాపారమైనే కొనుగోలుదారులను ఆకట్టుకుకేనే విధానంపైనే ఆధారపడి ఉంటుంది. ఎక్కువ వస్తువులు అమ్మితే ఎక్కువ లాభాలు వస్తాయి. కొనేవాల్లు లేకుండా ఈ గలు కొట్టుకుంటూ త్వరలోనే దుకాణం మూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఓ వ్యాపారి.. తన వ్యాపారం కోసం ఓ ఎత్తుగడ వేశాడు. ఎవరూ ఊహించని విదంగా కస్టమర్లతో బట్టలు కొనిపిస్తున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఇలా కూడా బట్టలు అమ్మొచ్చు.. బట్టల వ్యాపారం చేసేవాళ్లు అమ్మకాలు పెరిగేందుకు గిఫ్టులు, […]

Written By: Raghava Rao Gara, Updated On : March 10, 2023 4:43 pm
Follow us on

Variety Business

Variety Business: ఏ యాపారమైనే కొనుగోలుదారులను ఆకట్టుకుకేనే విధానంపైనే ఆధారపడి ఉంటుంది. ఎక్కువ వస్తువులు అమ్మితే ఎక్కువ లాభాలు వస్తాయి. కొనేవాల్లు లేకుండా ఈ గలు కొట్టుకుంటూ త్వరలోనే దుకాణం మూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఓ వ్యాపారి.. తన వ్యాపారం కోసం ఓ ఎత్తుగడ వేశాడు. ఎవరూ ఊహించని విదంగా కస్టమర్లతో బట్టలు కొనిపిస్తున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతోంది.

ఇలా కూడా బట్టలు అమ్మొచ్చు..
బట్టల వ్యాపారం చేసేవాళ్లు అమ్మకాలు పెరిగేందుకు గిఫ్టులు, బై వన్‌ గెట్‌ వన్‌ ఆఫర్లు ఇస్తారు. ఇటీవల కొన్ని షాపింగ మాల్స్‌ కిలో సేల్, క్లియరెన్స్‌ సేల్‌ అంటూ అమ్మకాలు సాగిస్తున్నాయి. అందరిలా వ్యాపారం చేస్తే వెరైటీ ఏముంటుందనుకున్నాడు ఈ వ్యాపారి. డిస్కౌంట్, గిఫ్ట్, బై వన్, గెట్‌ వన్‌ ఆఫర్‌ లేకుండానే తన సేల్స్‌ పెంచుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు.

ప్రతి ఒక్కరూ కొనాలని..
తన షాపు ముందు నుంచి వెళ్లే ప్రతీ కస్టమర్‌ తన షాపులో కొనుగోలు చేయాలని ప్లాన్‌ చేశాడు. ఇందుకోసం ఇద్దరిని తన షాపు ముందు పెట్టుకున్నాడు. వాళ్లు కస్టమర్లను షాప్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు నిలబడి ఉంటున్నారు. కస్టమర్లు నడుచుకుంటూ షాప్‌లోకి రాకుండా వెళ్లిపోయేవారిని వెనుక నుంచి దొరకబట్టి.. వారి చొక్కాలు చించేస్తున్నారు. అంతటితో ఆగకుండా వారిని షాప్‌లోకి తోసేస్తున్నారు. అప్పటికే బట్టలు చినిగిపోవడంతో వారు విధిలేక అదేషాప్‌లో షర్ట్స్‌ కొనుగోలు చేస్తున్నారు.

Variety Business

నెట్టింట్లో వైరల్‌..
ఇలా విచిత్రంగా వ్యాపారం చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఇదెక్కడి వ్యాపారం అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో వైరల్‌ అవుతోంది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు సెటైరికల్‌ కామెంట్స్‌ పెడుతున్నారు. వీడియో పెట్టిన వాడికి అనుభవం అయిందనుకుంటా అని కొందరు.. అమ్మబాబోయ్‌ ఇదేం వ్యాపారం అంటూ ఇంకొందరు. బిజినెస్‌ ట్రిక్‌ బాగుందని మరికొందరు కామెట్‌ చేస్తున్నారు. మొత్తంగా ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉడడం అన్నట్లుగా సరికొత్త వ్యాపారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

Tags