IAS Interview
IAS Interview: ఐఏఎస్ సాధించడం చాలా కష్టమైన విషయం అనేది తెలిసిందే. అహర్నిశలు కష్టపడి చదివితే కానీ, విజయం సాధించలేము. సివిల్స్ పరీక్షలో ర్యాంక్ సాధించడం ఒక ఎత్తయితే, ఐఏఎస్ ఇంటర్వ్యూ పాసవడం ఇంకొక ఎత్తని చెప్పవచ్చు. ఇంటర్వ్యూని క్రాక్ చేయాడానికి బుక్ నాలెడ్జ్ ఒకటే సరిపోదు. ఎందుకంటే నాలెడ్జి పైనే మాత్రమే కాకుండా పర్సనాలిటీ, సమయస్ఫూర్తి వంటి వాటిపై కూడా ప్రశ్నలు అడుగుతారు. అటువంటి సివిల్స్ ఇంటర్వ్యూకి వచ్చిన ఓ యువకుడిని అడిగిన ప్రశ్న ఐఏఎస్‌లో అడిగిన టాప్ ప్రశ్నలలో ఒకటిగా నిలిచింది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
వివిధ పరీక్షలు..
ప్రతి సంవత్సరం వేలాది మంది సివిల్స్ ఎగ్జామ్ రాస్తుంటారు. వారిలో కొంతమంది మాత్రమే ఎంపిక అవుతుంటారు. సివిల్స్ సర్వీసెస్‌కు ఎంపిక కావడానికి మూడు పరీక్షలను ఎదుర్కోవాలి. వాటిలో ప్రిలిమ్స్, మెయిన్స్ అభ్యర్థుల అకడమిక్, జనరల్ అవేర్‌నెస్‌ను, విభిన్న అంశాలను పరీక్షించడం కోసం నిర్వహిస్తారు. ఇంటర్వ్యూను సివిల్ సర్వీసెస్ అభ్యర్థి యొక్క వ్యక్తిత్వం మరియు స్వభావానికి సంబంధించిన పరీక్ష అని చెప్పవచ్చు. సివిల్స్ ఎగ్జామ్ ఎంత కఠినంగా ఉంటుందో, ఆ పరీక్ష పాస్ అయిన తరువాత అత్యంత క్లిష్టమైన ఇంటర్వ్యూను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలోఆ దిగే ప్రశ్నలకు తర్కంతో ఆలోచిస్తే తప్ప జవాబులు చెప్పలేము. ఊహించని ప్రశ్నలు కూడా అడుగుతుంటారు.
ఆ ప్రశ్నే ఇప్పుడు టాప్..
ఈ క్రమంలోనే సివిల్స్ ఇంటర్వ్యూలో ఒక యువకుడిని అడిగిన ప్రశ్న టాప్ ఐఏఎస్ ప్రశ్నల్లో ఒకటిగా నిలిచింది. అది ఏమిటంటే.. ‘నువ్వు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి. ఆమెకు చెవులు, కళ్లు, నోరు పనిచేయవు. ఆమెను తాకకుండా ఎలా ప్రపోజ్ చేస్తావు?’ అని అడిగారు. ఇది లాజిక్ ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం, ఆ అబ్బాయి అంధుడు, చెవిటివాడు మూగవాడు కాదు కాబట్టి ప్రపోజ్ చేయగలడు. అయితే అతని ప్రతిపాదనను అమ్మాయి అర్థం చేసుకోవాలని చెప్పలేదు అని ఆ యువకుడు చెప్పాడు. ఈ సమాధానంతో ఇంటర్వ్యూ ప్యానెల్ సభ్యులు కూడా షాక్ అయ్యారు. యువకుడి సమాధానానికి సంతృప్తి చెందారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Tricky question on proposing a girl
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com