https://oktelugu.com/

సంక్రాంతికి టగ్ ఆఫ్ వార్‌.. బ‌రిలో ప‌వ‌న్ – మ‌హేష్‌..?

సంక్రాంతి సీజన్ టాలీవుడ్ కు ఎంత పెద్ద పండగో అందరికీ తెలిసిందే. తెలుగు లోగిళ్ల‌న్నీ క‌ళ‌క‌ళ‌లాడుతుంటే.. బాక్సాఫీస్ గ‌ల‌గ‌ల‌లాడుతుంది. ఏ మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. సినిమా ఈజీగా ప్రాఫిట్ లోకి వ‌చ్చేస్తుంది. ఇక‌, హిట్ టాక్ సొంతం చేసుకుంటే అంతే.. నిర్మాత గ‌ల్లాపెట్టె పొంగి పొర్లుతుంది. అందుకే.. ఏ మాత్రం అవ‌కాశం ఉన్నా.. సంక్రాంతి బ‌రిలో త‌మ సినిమా నిలిపేందుకు నిర్మాత‌లు ప్ర‌య‌త్నిస్తుంటారు. Also Read: ‘ఉప్పెన’ హీరోయిన్ తో సుధీర్ ప్రేమ దానికోసం ముందుగానే […]

Written By:
  • Rocky
  • , Updated On : February 27, 2021 / 01:55 PM IST
    Follow us on


    సంక్రాంతి సీజన్ టాలీవుడ్ కు ఎంత పెద్ద పండగో అందరికీ తెలిసిందే. తెలుగు లోగిళ్ల‌న్నీ క‌ళ‌క‌ళ‌లాడుతుంటే.. బాక్సాఫీస్ గ‌ల‌గ‌ల‌లాడుతుంది. ఏ మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. సినిమా ఈజీగా ప్రాఫిట్ లోకి వ‌చ్చేస్తుంది. ఇక‌, హిట్ టాక్ సొంతం చేసుకుంటే అంతే.. నిర్మాత గ‌ల్లాపెట్టె పొంగి పొర్లుతుంది. అందుకే.. ఏ మాత్రం అవ‌కాశం ఉన్నా.. సంక్రాంతి బ‌రిలో త‌మ సినిమా నిలిపేందుకు నిర్మాత‌లు ప్ర‌య‌త్నిస్తుంటారు.

    Also Read: ‘ఉప్పెన’ హీరోయిన్ తో సుధీర్ ప్రేమ

    దానికోసం ముందుగానే ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తుంటారు. ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. కాగా.. రాబోయే సంక్రాంతికి సంబంధించిన డిస్క‌ష‌న్ ఇప్పుడే హాట్ హాట్ గా కొన‌సాగుతోంది. వ‌చ్చే పొంగ‌ల్ బ‌రిలో భారీ చిత్రాలు నిల‌వ‌బోతుండ‌డంతో చ‌ర్చ ఆస‌క్తిక‌రంగా మారుతోంది. టాలీవుడ్లో ప‌వ‌న్ – మ‌హేష్ క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన ప‌నిలేదు. వీరి చిత్రాలు రిలీజ్ అవుతున్నాయంటే.. మిగిలిన నిర్మాత‌లు ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తారు. అలాంటిది.. వారిద్ద‌రే పోటీ ప‌డ‌బోతుండ‌డంతో ఫ్యాన్స్ లో హై ఓల్టేజ్ క్యూరియాసిటీ డెవ‌ల‌ప్ అవుతోంది. రాబోయే సంక్రాంతికి వీరిద్ద‌రి చ‌రిత్ర‌లో బ‌రిలో నిలుస్తాయ‌నే ప్ర‌చారం సాగుతోంది.

    సూప‌ర్ స్టార్ మ‌హేష్ – ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ కాంబోలో రాబోతున్న మూవీ ‘సర్కారు వారి పాట’. టైటిల్ తోనే హై క్యూరియాసిటీ క్రియేట్ చేసిన ఈ సినిమా సంచ‌ల‌నం సృష్టించ‌డం ఖాయమని నమ్ముతున్నారు ఫ్యాన్స్. బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయలు కాజేసే ఆర్థిక నేరగాళ్ల పనిపట్టే కథతో వస్తోందీ మూవీ. తన తండ్రిపై మోపిన నిందను తుడిచేసి, నిజమైన నేరగాళ్లను పట్టించే కొడుకు పాత్రలో నటించబోతున్నాడట మహేష్.

    ఇటీవ‌లే దుబాయ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చింది యూనిట్. మార్చిలో గోవాలో సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు పరశురామ్. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘సర్కారు వారి పాట’ షూటింగ్ మొత్తం ఆగస్టు నాటికి కంప్లీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది యూనిట్. ఆ తర్వాత శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసి, 2022 సంక్రాంతి బరిలో చిత్రాన్ని నిలపాలన్నది టార్గెట్. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ తోపాటు, మహేష్ బాబు సొంత ప్రొడక్షన్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

    Also Read: ‘గాలి సంపత్’ ట్రైలర్ టాక్: ఫఫ్సా లాంగ్వేజ్ తో తండ్రీకొడుకుల సెంటిమెంట్

    ఇక‌, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ – ద‌ర్శ‌కుడు క్రిష్ కాంబోలో హిస్టారికల్ మూవీ రాబోతున్న విష‌యం తెలిసిందే. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ మూవీకోసం ఫ్యాన్స్ ఓ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారు. స్టోరీ, ప‌వ‌న్ గెట్, సినిమా టైటిల్ నుంచి ప్ర‌తిదీ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. 15 శ‌తాబ్దం నాటి ప‌రిస్థితుల ఆధారంగా తెర‌కెక్కుతున్న‌ ఈ పీరియాడికల్ డ్రామాలో.. పవన్ వ‌జ్రాల దొంగ‌గా క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ చిత్రానికి ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.

    మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు క్రిష్. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అర్జున్ రాంపాల్ కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఎఎం రత్నం నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు.

    అయితే.. ఈ సినిమాను కూడా సంక్రాంతి బ‌రిలో నిలిపేందుకు చూస్తోంది యూనిట్. స‌ర్కారువారి పాట‌, ప‌వ‌న్ సినిమా రెండూ ఇంచుమించుగా ఒకేసారి మొదలైన‌ట్టు లెక్క‌. దీంతో.. రెండూ కొద్దిపాటి గ్యాప్ తోనే కంప్లీట్ అవుతాయి. మ‌హేష్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు ఇప్ప‌టికే అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇప్పుడు ప‌వ‌న్ మూవీ కూడా పొంగ‌ల్ కే సిద్ధం చేస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి, ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి. ఒక‌వేళ ఈ మూవీకూడా సంక్రాంతికి స్లాట్ బుక్ చేసుకుంటే.. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ యుద్ధం మొద‌ల‌వుతుంద‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్