Ice Cream Dosa: సాధారణంగా మనం దోశ ఎలా తయారు చేస్తాం? మినుములు, బియ్యం నానబెట్టి మెత్తగా రుబ్బుతాం.. అందులో కొంచెం ఫ్లేవర్ కోసం ఈస్ట్ కలుపుదాం.. రుచి కోసం ఉప్పు యాడ్ చేస్తాం.. ఇక మసాలా దోశ కావాలంటే ఆలుతో తయారుచేసిన మసాలా దాని పైన వేస్తాం. ఇంకా ఇతర రుచులు కావాలనుకుంటే రకరకాల పదార్థాలు దానిపై వేస్తాం.. ఇక ఈ దోశల్లో రకరకాలు ఉన్నాయి.. పెసర దోశ, చిట్టి దోశ, మిలెట్స్ దోశ, కారం దోశ, పొడి మసాలా దోశ, ఘీ కారం దోశ, రోస్ట్ దోశ,ఎగ్ దోశ, ప్లెయిన్ దోశ, బట్టర్ దోశ, చీజ్ దోశ, పిజ్జా దోశ.. ఇలా చెప్పుకుంటూ పోవాలే గానీ చాంతాడంత జాబితా ఉంది.. ఆహార ప్రియులు వారికి ఇష్టమైన వెరైటీ వెరైటీ దోశలను ఆస్వాదిస్తూ ఆరగించేస్తున్నారు.
ఇక దక్షిణాది రాష్ట్రాల్లో టిఫిన్స్ లో దోశకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. పుర్రె కొబుద్ది… జిహ్వకో రుచి అన్నట్టు.. ఈ దోశలో కూడా కొత్త కొత్త రకాలు పుట్టుకొస్తున్నాయి.. అంతే కాదు స్టార్టప్ కంపెనీలు కూడా దోశ తయారీ యూనిట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాయి.. అంటే మన ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ గా పనికి వచ్చే దోశ… మన కడుపు నింపిన దోశ… ఇప్పుడు సమూల మార్పులకు గురవుతున్నదన్నమాట.. తమిళనాడు ప్రాంతంలో అయితే నాన్ వెజ్ దోశలు ఫేమస్ అయిపోయాయి.
కానీ మీరు ఎప్పుడైనా ఐస్ క్రీమ్ దోశ తిన్నారా? పోనీ చూశారా? షాక్ అయ్యారు కదా,! మేము ఇప్పుడు ఐస్ క్రీమ్ దోశ మీకు పరిచయం చేయబోతున్నాం.. పుర్రెకు ఓ బుద్ధి… జిహ్వకు ఓ రుచి అన్నట్టు.. ఓ వీధి వ్యాపారి ఐస్ క్రీమ్ తో దోశ తయారు చేసి కొత్త ట్రెండ్ సృష్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నది. అది చూసిన నెటిజన్లు షాక్ అవుతూ కామెంట్లు పెడుతున్నారు.. మీరు కూడా దానిపై ఒక లుక్కేయండి.. ముందుగా కాలుతున్న పెనంపై దోశ పిండిని అతడు పరిచాడు.. ఆ తర్వాత రకరకాల ఐస్ క్రీమ్ ఫ్లేవర్లను దానిపై అప్లై చేశాడు.. ఆ తర్వాత చట్నీలో ముంచుకుని తిన్నాడు.. రుచి ఎలా ఉందో అతడికే తెలియాలి.. కానీ ఏ మాటకు ఆ మాట ఒంటికి చల్లదనాన్ని ఇచ్చే ఐస్ క్రీమ్… పెనంపై పడగానే వేడెక్కింది.. బుస్సు మంటూ పొగలు కక్కింది.
South Indian dish dosa ko Gujarat me survive karne k liye icecream se dosti karna pad ja raha hai 😭😭😹 pic.twitter.com/Pq2UBuHriE
— Byomkesh (@byomkesbakshy) January 28, 2023