
Transgender Akshaya: హిజ్రాలు అనగానే ఒకప్పుుడు చిన్న చూపు ఉండేది. కానీ చాలా మందికి అవగాహన రావడంతో వారిని కొందరు చేరదీస్తున్నారు. ఇదే సమయంలో మరికొందరు ఇతర పనులకు కూడా వాడుకుంటున్నారు. కొందరు హిజ్రాలకు రోజుకు లక్ష రూపాయలు ఇచ్చి మరీ బుక్ చేసుకుంటున్నారట. ఈ విషయాన్ని ‘అక్షయ’ అనే హిజ్రా మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా లక్ష ఇచ్చి ఒక్కరు అని చెప్పి ఆ తరువాత చాలా మంది రూంలోకి వస్తారంటూ వాపోయింది. ఇటీవల ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ ఆమె చెప్పిన మరిన్ని విషయాలేంటంటే?
మనుషుల్లో రెండు రకాలు. పురుషులు, స్త్రీలు. కానీ ఈ రెండు లింగాలు కాకుండా ఉండేవారినే హిజ్రాలు అని అంటారు. వారు తప్పు చేయకున్నా హిజ్రాలు మారిన చాలా మంది ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. వీరికి సరైన గుర్తింపు లేకపోవడంతో జీవితం గడవడమే గగనంగా మారుతుంది. అయితే ఫంక్షన్లలో, ఇతర ప్రత్యేక కార్యక్రమాల్లో ఇటీవల హిజ్రాలు దూకుడు పెంచుతున్నారు. పెళ్లి జరిగే సమయానికి వచ్చి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్నిచోట్ల వీరి తీవ్రత తట్టుకోలేక దాడులు కూడా జరిగాయి. అయితే ‘అందరూ ఇలా ఉండరు. కొంత మంది మాత్రమే చీఫ్ గా వ్యవహరిస్తారు.మేం ఏం చేసిన కడుపు నింపుకోవడం కోసమే’ అని అక్షయ అనే హిజ్రా అంటున్నారు.
పొట్ట కూటికోసం ఏ పనైనా చేయాల్సి వస్తోందంటూ అక్షయ అనే హిజ్రా చెబుతున్నారు. కొందరు తమకు లక్ష రూపాయలు ఇచ్చి బుక్ చేసుకుంటారన్నారు. అయితే ఒక్కరు అని చెప్పి ఆ తరువాత ఒకరి తరువాత ఒకరు వచ్చి ఏదేదో చేస్తుంటారన్నారు. కొందరైతే ముందు డబ్బులిస్తామని చెప్పి పని పూర్తయిన తరువాత ఇవ్వకుండా వెళ్తారన్నారు. బయట ఏ పనిచేయాలన్న మమ్మల్ని రానివ్వరు. కనీసం ఈ పనిచేసైనా పొట్టనింపుకుందామని అనుకుంటే ఇలా మోసం చేస్తారు. ప్రభుత్వం గుర్తింపు కోసం ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదు. మాపై ప్రభుత్వమే కనికరించి ఏదైనా ఉపాధి చూపించాలి అని ఆమె తెలుపుతోంది.
ఒకప్పడు మాపై వివక్ష ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అందరికీ మా గురించి అవగాహన కలుగుతోంది. కానీ మమ్మల్ని వేరే పనులకు వాడుకుంటున్నారు. పనులు ఇప్పిస్తామని చెప్పి ఆ తరువాత మోసం చేస్తున్నారు. మేం ఏ చేసిన పొట్ట నింపుకోవడానికే. కానీ నోటికాడి కూడు కూడా రాకుండా కొందరు మోసం చేయడం బాధ కలిగిస్తోందని ‘అక్షయ’ కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికైనా మమ్మల్ని మనుషులుగా గుర్తించండి.. అంటూ ఆమె వేడుకుంటున్నారు.