
Phones using Children Dangers : ఇటీవల స్మార్ట్ ఫోన్లు కలవరపెడుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అందరు ఫోన్లు వాడుతున్నారు. చిన్న పిల్లలకు కూడా అలవాటు చేస్తున్నారు. దీంతో పిల్లలు మారాం చేస్తే ఫోన్లు అప్పగిస్తున్నారు. వారు ఫోన్లకు ఆకర్షితులు అవుతున్నారు. చేతిలో ఫోన్ పట్టుకుని గేమ్ లు ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు. ఫోన్ తీస్తే చాలు ఏడుపు లంకించుకుంటున్నారు. ఏం చేయాలో తోచక వారికి సెల్ ఫోన్ ఇస్తున్నారు. దీని వల్ల వారు భవిష్యత్ లో ఫోన్లకు బానిసలు కానున్నారు. ఫోన్లకు వారు దగ్గర కావడంతో నిరంతరం వాటిని చూడటానికి మొగ్గు చూపుతున్నారు.
సోషల్ మీడియా ప్రభావం
సోషల్ మీడియా ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారు. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విటర్ వంటి వాటితో నిరంతరం చూస్తూ గడుపుతున్నారు. ఫోన్ చేతిలో ఉందంటే చాలు ఇక దేన్ని లెక్క చేయడం లేదు. ఎవరిని పట్టించుకోకుండా ఎప్పుడు ఫోన్ చూస్తూనే ఉంటున్నారు. తిండి కూడా తినకుండా ఫోన్ తోనే ఉంటున్నారు. ఇదేంటని అడిగితే మారాం చేస్తున్నారు. ఇదే తంతు కొనసాగితే భవిష్యత్ లో మనుషుల మధ్య అనుబంధాలు మరింత తగ్గనున్నాయి.
మారాం చేస్తే..
చిన్న పిల్లలు మారాం చేస్తే వారికి చేతిలో సెల్ పెడుతున్నారు. దీంతో వారు ఏడుపు ఆపేసి ఫోన్ తో ఆడుకుంటున్నారు. అందులో బొమ్మలు చూస్తూ ఉంటున్నారు. దీంతో తల్లిదండ్రులు వారి పనులు వారు చేసుకుంటున్నారు. ఇలా చేసిన అలవాటు వారిని ఎన్నో తప్పులు చేయిస్తోంది. ఫో్న్ లేనిదే ఉండటం లేదు. తమ చేతిలో ఫోన్ పెడితే దానిలో వీడియోలు చూస్తూ కేరింతలు కొడుతున్నారు. ఇలా చేయడంతో తల్లిదండ్రులు కూడా వారిని ఫోన్లకు ఆకర్షితులను చేస్తున్నారు.

చిన్నతనంలో..
మనం చిన్నతనంలో అన్నం తినమని మారాం చేస్తే గోరుముద్దలు పెడుతూ కథలు చెప్పేవారు. దీంతో మనం ఎంతో ప్రేమగా తినేవాళ్లం. కానీ ఇప్పుడు కథలకు బదులు ఫోన్లు ఇస్తున్నారు. దీంతో వారు ఫోన్లకు అలవాటు పడుతున్నారు. ఇక ఫోన్ లేనిదే నేను తిననని చెబుతుండటంతో అమ్మ చేసేది లేక ఫోన్ చేతిలో పెడుతున్నారు. దీని వల్ల భవిష్యత్ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. వారు యూట్యూబ్ లో వీడియోలు చూస్తూ తింటున్నారు. ఇది మంచి సంప్రదాయం కాదు. కానీ తెలిసినా తల్లిదండ్రులు అదే మార్గాన్ని ఎంచుకోవడం గమనార్హం.