Jabardast comedian: జబర్దస్త్ కమెడియన్ పటాస్ ప్రవీణ్ ఇంట్లో విషాదం నెలకొంది. అతడి తండ్రి మంగళవారం కన్నుమూయడం తెలిసిందే. దీంతో జబర్దస్త్ టీం ప్రవీణ్ కు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన ప్రవీణ్ కు ప్రస్తుతం తండ్రి కూడా లేకుండా పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. తమ తండ్రి తల్లి లేకపోయినా తల్లి లేని లోటు తెలియకుండా పెంచాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రవీణ్ తండ్రి కొంత కాలంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నాడు. ఎంత చికిత్స చేసినా ఆరోగ్యం సహకరించకపోవడంతో వైద్యులు ఇక చివరి చూపు చూసుకోవచ్చని తెలిపారు. దీంతో ప్రవీణ్ రోదిస్తున్నాడు.
Also Read: Bollywood Flops: బాలీవుడ్ ప్లాప్ షో… స్టార్ హీరోలతో సక్సెస్ వెతుక్కుంటున్న ఇండస్ట్రీ..!!
తమ తండ్రి ఇద్దరు కొడుకులను అపురూపంగా పెంచాడని తెలిపాడు. మా కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప వ్యక్తిగా అభివర్ణించాడు. పటాస్ షో ద్వారా జబర్దస్త్ లోకి ప్రవేశించిన ప్రవీణ్ తనదైన శైలిలో కామెడీ చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు. ప్రాసలతో పంచులు వేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు పొందిన ప్రవీణ్ ప్రస్తుతం కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఎంత ప్రయత్నించినా ఆయన ప్రాణాలు నిలుపుకోలేకపోయారు. దీంతో ప్రవీణ్ విచారం వ్యక్తం చేస్తున్నాడు.
Also Read: Sudheer Anasuya: ఈటీవీలోకి మళ్లీ సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, అనసూయ ఎంట్రీ! అసలేమైంది?
ఆయనను బతికించేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. కాళ్లు, చేతులు వాయడంతో ఇక చేసేది లేకపోవడంతో ఆయన ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. దీంతో ప్రవీణ్ కుటుంబం విషాదంలో మునిగింది. తమకు పెద్ద దిక్కుగా ఉన్న తండ్రి దూరం కావడంతో ఇక ఏం చేసేదని ప్రవీణ్ బాధ పడుతున్నాడు. ఇక మాకు ఇద్దరు దూరం కావడంతో భవిష్యత్ ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఆ దేవుడు తండ్రిని దూరం చేసి మాకు కఠిన పరీక్ష పెట్టాడని చెబుతున్నాడు. జబర్దస్త్ లో తన సత్తా చాటుతూ ఇటీవల ఓ కారు కూడా కొనుగోలు చేశాడు. జీవితంలో ఎదగాలని చూస్తున్న క్రమంలో విషాదం చోటుచేసుకోవడం బాధాకరమే. తన కారును కూడా జడ్జి ఇంద్రజతో నడిపించి అమ్మలేని లోటును తీర్చుకోవాలని కోరడంతో ఆమె కూడా ప్రవీణ్ ను ప్రోత్సహించింది. తన కొడుకు లాంటి ప్రవీణ్ ను దీవించడంతో ఆమెలో అమ్మను చూసుకుని కంట నీరు కార్చాడు. ఇప్పుడు తండ్రి దూరం కావడంతో ఇక మాకు దిక్కెవరని దీనంగా చూస్తున్నాడు. ప్రవీణ్ కుటుంబానికి పలువురు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.