
Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో టీపీసీసీ చీఫ్ మరో వివాదానికి తెర తీస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే అంతర్గత కుమ్ములాటలతో ఇప్పటికే సీనియర్లు రేవంత్‌కు దూరంగా ఉంటున్నారు. అధిష్టానానికి ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోవడంతో సీనియర్లే సైలెంట్ ఆయ్యారు. అధిష్టానం ఆదేశాలతో తెలంగాణలో పాదయాత్ర మొదలు పెట్టిన రేవంత్.. సీనియర్లను టీజ్ చేస్తున్నారు. తాను చేస్తున్న పాదయాత్రకు అద్భుత స్పందన వçస్తుండడం, ఇతరులకు కనీసం తన నియోజకవర్గాల్లో కూడా పలుకుబడి లేని పరిస్థితి ఉండటంతో రేవంత్ దూకుడు మీద ఉన్నారు. మహేశ్వర్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభించి స్పందన లేక ఆపేశారు. ఆదిలాబాద్ నుంచి భట్టి విక్రమార్క యాత్ర ప్రారంభించారు. జన స్పందన అంతంతమాత్రంగా ఉంది. దీంతో అదీ సాగుతుందా అనే సందేహం మొదటి రోజే ప్రారంభమైంది.
సీఎం అభ్యర్థిగా ప్రచారం..
సీయర్లుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలు చేపట్టిన యాత్రలకు పెద్దగా స్పందన లేకపోవడం, రేవంత్ యాత్రకు రెస్పాన్స్ బాగుండడంతో తానే సీఎ అభ్యర్థినని పాదయాత్రలో మీడియా ప్రతినిధులతో పరోక్షంగా చెప్పుకుంటున్నారు రేవంత్. కాంగ్రెస్ తప్పకుండా అధికారంలోకి వస్తుందని, తానే సీఎం అభ్యర్థి అన్న విషయంలో క్లారిటీగా ఉన్నానని చెబుతున్నారు. తాను పొలిటికల్ ఎంట్రీ నుంచి క్లారిటీగా ఉన్నానని అందుకే ఎమ్మెల్యే అయ్యానంటున్నారు. అప్పుడు క్లారిటీగా ఉన్నాను. ఆ తర్వాత ఎంపీ అయ్యాను. టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యాను ఇప్పుడు కూడా చాలా క్లారిటీగా ఉన్నానని చెప్పుకొచ్చారు. అంటే సీఎం అవుతాననే దానిపైన తాను క్లారిటీగా ఉన్నాను అనే దాన్ని చెప్పకనే చెబుతున్నారు రేవంత్. మరోసారి కొడంగల్ నుంచి పోటీ చేయడానికి రేవంత్ రెడ్డి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డిని మళ్లీ పార్టీలో చేర్చుకున్నారు. రెండు సార్లు అక్కడ్నుంచి గెలిచినా గత ఎన్నికల్లో ఓడిపోయారు రేవంత్.

సెంటిమెంటు కలిసొస్తుందని..
ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా ఏ పార్టీకి మూడుసార్లు అధికారం దక్కలేదు. తెలంగాణలోనూ అదె సెంటిమెంట్ కొనసాగుతుందని టీపీసీసీ చీఫ్ భావిస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఈసారి బీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తానే సీఎం అనేలా సంకేతాలు ఇస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యలు సహజంగానే సీనియర్లకు ఆగ్రహం తెప్పిస్తాయి.. కానీ రేవంత్ ఈ మాటలను మీడియాతో పిచ్చాపాటిగా అంటున్నారు. అందుకే వారు ఎవరికీ ఫిర్యాదు చేయలేని పరిస్థితి. మరి ఈ వ్యాఖ్యలు మరో వివాదానికి దారితీస్తాయో.. లేక సీనియర్లు లైట్ తీసుకుంటారో చూడాలి.