https://oktelugu.com/

Bank Holidays: గురునానక్ జయంతి సహా నవంబర్ నెలలో మొత్తం ఎన్ని రోజులు బ్యాంకులు సెలవులు అంటే?

గురునానక్ జయంతికి కొన్ని రాష్ట్రాల్లో జరుపుకుంటారు. గురుపురబ్, గురునానక్ ప్రకాష్ ఉత్సవ్ అని కూడా ఈ జయంతిని పిలుస్తారు. మొదటి సిక్కు గురువు గురునానక్ పుట్టిన జ్ఞాపకార్థంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

Written By: Kusuma Aggunna, Updated On : November 13, 2024 1:15 pm

Bank Holidays

Follow us on

Bank Holidays: సాధారణంగా ప్రతీ నెలలో బ్యాంక్ సెలవులు ఉంటాయి. ముఖ్యంగా పండుగలు వస్తున్నాయంటే ఇంకా చెప్పక్కర్లేదు. బ్యాంకు ఉద్యోగులకు చాలా పండుగలకు సెలవులు దొరుకుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల వారికి తప్పకుండా కొన్ని నెలలో ఎక్కువగానే సెలవులు ఉంటాయి. బ్యాంకు ఉద్యోగస్తులకు అయితే శని, ఆదివారాలతో పాటు పండుగలకు కూడా సెలవులు ఉంటాయి. అయితే ఈ నెలలో కొన్ని పండుగలు ఉండటం వల్ల బ్యాంకు వాళ్లకు సెలవులు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ నెలలో పండుగల నేపథ్యంలో సెలవులను విడుదల చేసింది. నవంబర్ 15న గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. నవంబర్ 15న శుక్రవారం రోజు ఎన్నో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అయితే ఈ సెలవుల్లో కొన్ని ప్రాంతాల బట్టి మార్పులు ఉంటాయి. ఈ నవంబర్ నెలలో ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాల్లో కూడా బ్యాంకులు సెలవు ఉంటాయి.

గురునానక్ జయంతికి కొన్ని రాష్ట్రాల్లో జరుపుకుంటారు. గురుపురబ్, గురునానక్ ప్రకాష్ ఉత్సవ్ అని కూడా ఈ జయంతిని పిలుస్తారు. మొదటి సిక్కు గురువు గురునానక్ పుట్టిన జ్ఞాపకార్థంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. సిక్కుమతం స్థాపకుడు గురునానక్‌ ప్రముఖ సిక్కు గురువులలో ఒకరు. ఇతనికి సిక్కులు ఎంతో భక్తితో పూజిస్తారు. అతని దినోత్సవాన్ని మిజోరాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, చండీగఢ్, ఉత్తరాఖండ్, హైదరాబాద్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ, ఉత్తరప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లో జరుపుకుంటారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో అయితే కార్తీక పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటారు. ఈ రెండు సందర్భాలను దృష్టిలో పెట్టుకుని సెలవులను ప్రకటించింది. బెంగాల్, ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్‌లో గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ 15న బ్యాంకులుకు సెలవు ఇచ్చారు. అలాగే కనకదాస జయంతి సందర్భంగా కర్ణాటక బ్యాంకులకు సెలవులకు ప్రకటించారు. సెంగ్ కుత్స్నేమ్ సందర్భంగా మేఘాలయాలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

నవంబర్ 15వ తేదీన గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ, ఒడిశా, చండీగఢ్, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, ఢిల్లీ, గుజరాత్, జమ్మూకశ్మీర్‌లో బ్యాంకులు సెలవు ఉంటాయి. అలాగే నవంబర్ 17వ తేదీన ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు సెలవు. నవంబర్ 18వ తేదీన కనకదాస జయంతిని పురస్కరించుకుని కర్ణాటకలో బ్యాంకులు సెలవు ఉంటాయి. నవంబర్ 22వ తేదీన లబాబ్ డుచెన్ సందర్భంగా సిక్కింలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. నవంబర్ 23వ తేదీన నాలుగో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. నవంబర్ 24వ తేదీన ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. అయితే సాధారణంగా దేశవ్యాప్తంగా ఒకే రకంగా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో అక్కడ ప్రత్యేకతను బట్టి సెలవుల్లో మార్పులు ఉంటాయి.