Homeట్రెండింగ్ న్యూస్Top Female Chefs: నల భీములు సరే.. మన దేశం లో ఈ నల భీమమ్మ...

Top Female Chefs: నల భీములు సరే.. మన దేశం లో ఈ నల భీమమ్మ ల గురించి తెలుసా?

Top Female Chefs: నలభీమ పాకం అని చిన్నప్పుడు చదువుకున్నాం గాని నల భీమమ్మ పాకం గురించి మనకు ఎవరూ చెప్పలేదు.. సంజయ్ తుమ్మ వంటి చెఫ్ ల గురించి మాత్రమే తెలిసిన మనకు.. అరోరా వంటి ఫిమేల్ చెఫ్ ల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.. చాలామంది వంటింటి కుందేలు అని ఆడవాళ్లను హేళన చేస్తారు కానీ.. ఆ వంటింట్లో వండే వంటలో మగవాళ్లదే డామినేషన్ అందుకే ఫైవ్ స్టార్ హోటల్స్ లోకి వెళ్తే చెఫ్ లుగా మగవాళ్ళే కనిపిస్తారు. కానీ మనకు తెలియని ఫిమేల్ చెఫ్ లు ఉన్నారు. భారతదేశంలో పుట్టిన వారు.. నలభీమమ్మలుగా వర్ధిల్లుతున్నారు.

గరీమా ఆరోరా

ఉత్తర భారతదేశానికి చెందిన ఈమె మనదేశంలో టాప్ -10 ఫీ మేల్ చెఫ్ లలో ఒకరు.. బ్యాంకాక్ లో గాతో అనే పేరుతో ఒక రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఇది సూపర్ సక్సెస్ కావడంతో మిచెలి స్టార్ పేరుతో మరో రెండు రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు. ఈమెకు పాక శాస్త్ర ప్రావీణ్యం ఉంది. అందుకే రెస్టారెంట్ల వ్యాపారంలో దూసుకుపోతోంది. గాతో రెస్టారెంట్ కు బ్యాంకాక్ లో మంచి పేరుంది.

అనహిత దొండి

పార్సి కుటుంబానికి చెందిన యువతి మొదట హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ నేర్చుకుంటా అంటే కుటుంబ సభ్యులు వారించారు. తర్వాత ఆమె ఇష్టాన్ని తెలుసుకొని గౌరవించారు. హోటల్ మేనేజ్మెంట్ లో డిగ్రీ చేసిన ఈమె సొంతంగా రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు. పార్సి వంటకాలను తన కస్టమర్లకు పరిచయం చేశారు. అందులోనూ కొత్త కొత్త రకాలను సృష్టించి కస్టమర్ల నోటికి సరికొత్త రుచులు అందిస్తున్నారు. ఔత్సాహిక చెఫ్ గా అనహిత దొండి పేరు గడించారు.

రీతు దాల్మియా

పాత తరం మహిళ చెఫ్ లలో ఈమెకు అగ్ర తాంబూలం దక్కుతుంది. పురుషాధిక్యమైన హోటల్ బిజినెస్ లో.. ఈమె ప్రవేశించి సత్తా చాటారు. తన కస్టమర్లకు తానే స్వయంగా వంట వండి పెట్టగలరు. ముఖ్యంగా నార్త్ ఇండియన్ వంటకాలు చేయడంలో ఈమె దిట్ట. పెద్ద పెద్ద వ్యాపారులు ఈమె వంటకు డైలీ కస్టమర్లు అంటే అతిశయోక్తి కాదు.

శిఫ్రా ఖన్నా

నార్త్ ఇండియా కు చెందిన ఈ యువతికి వంట చేయడం వంట చాలా ఇష్టం. అలా అనేక రకాల వంటలను ఆమె సృష్టించింది.. నార్త్, సౌత్ అని తేడా లేకుండా అన్ని రకాల వంటల్లోనూ ప్రయోగాలు చేసింది. ఏకంగా మాస్టర్ చెఫ్ రెండవ సీజన్లో విజేతగా నిలిచింది. టీవీ హోస్ట్ గా కూడా పనిచేస్తోంది. ఈమెకు ఒక క్లౌడ్ కిచెన్ ఉంది. కాకపోతే అందులో వెస్ట్రన్ డిషెస్ మాత్రమే లభిస్తాయి.

పంకజ్ బదౌరియా

మనదేశంలో మాస్టర్ చెఫ్ మొదటి సీజన్ విజేతగా పంకజ్ బదౌరియా నిలిచింది. సంప్రదాయ వంటలకు ఆధునిక మేళవింపు అద్దడంలో పంకజ్ ముందు వరుసలో ఉంటుంది. అలా వంట చేస్తుంది కాబట్టే ఆమె మాస్టర్ చెఫ్ మొదటి సీజన్ విజేత అయింది. ప్రస్తుతం ఈమె ఒక రెస్టారెంట్ నిర్వహిస్తోంది.. అందులో అన్ని రకాల వంటకాలూ లభిస్తాయి.

పూజా దింగ్రా

మనదేశంలో టాప్ పేస్ట్రీ చెఫ్ లలో పూజా ఒకరు. పేస్ట్రీ తయారీలో తనకు ఉన్న నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని.. పెద్ద పేస్ట్రీ తయారీ యూనిట్ నెలకొల్పారు.. అలా రకరకాల పేస్ట్రీలు తయారుచేసి యువతను ఆకట్టుకుంటున్నారు. వెస్ట్రన్ పేస్ట్రీస్ కోసం ఏకంగా మకరాన్ అనే పేరుతో పెద్ద హోటల్ కూడా ఏర్పాటు చేశారు..

బనీ నందా

మన దేశానికి ఫ్రెంచ్ డిసర్ట్స్ ను పరిచయం చేసిన ఘనత బని నందాకు దక్కుతుంది. ఇటీవల అంబానీ ఇంట్లో వేడుకలు జరిగినప్పుడు.. ఈమె రెస్టారెంట్ నుంచే అక్కడికి ఫ్రెంచ్ వంటకాలు వెళ్లాయి. Le cordn bleu పేరుతో ఆమె రెస్టారెంట్లు నిర్వహిస్తున్నారు.

తేజస్వి చండేలా

యూరోపియన్ వంటకాలు వండటంలో ఈ యువతి దిట్ట. యూరోపియన్ పేస్ట్రీల కు మోడ్రన్ టచ్ ఇచ్చి అద్భుతంగా తయారు చేయగల నేర్పరితనం ఈమె సొంతం. ఈమె తయారు చేసే పేస్ట్రీలకు ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే ఆమె తయారుచేసే విధానం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

మంజిలత్ ఫాతిమా

భారత్లో చివరి నవాబ్ అవధ్ కుటుంబానికి చెందిన మహిళ ఈమె. పలు రెస్టారెంట్లు ఓపెన్ చేసి కస్టమర్లకు నవాబుల వంటకాలను రుచి చూపిస్తున్నారు. బిర్యానీలో రకాలు మాత్రమే కాకుండా, చికెన్, మటన్ తో తయారు చేసే ప్రత్యేకమైన వంటకాలను కస్టమర్లకు అందిస్తున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular