Tomato Festival: స్పెయిన్ లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలలో ఏదో ఒక రూపంలో ఫెస్టివల్ జరుగుతూనే ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో టమాటా ఫెస్టివల్ జరుగుతుంది. మరి కొన్ని ప్రాంతాలలో ఆలు ఫెస్టివల్ జరుగుతుంది. ఇంకొన్ని ప్రాంతాలలో ఫ్రూట్ ఫెస్టివల్ జరుగుతుంది. అంతిమంగా ఈ వేడుకల వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అయితే ఇలాంటి టమాటా ఫెస్టివల్ మన దేశంలో తొలిసారి హైదరాబాదులో జరగనుంది. మే 11న హైదరాబాదులోని ఎక్స్ పీరియం పార్కులోని ప్రిజం అవుట్ డోర్ లో ఈ వేడుక నిర్వహించనున్నారు. దీనికి టమా టెర్రా ఫెస్టివల్ అని పేరు పెట్టారు. టమాటా ఫెస్టివల్ అనేది స్పానిష్ సంప్రదాయం. ప్రతి ఏడాది అక్కడ ఈ పండుగ ఘనంగా జరుగుతూ ఉంటుంది.. పర్యటకులను దృష్టిలో పెట్టుకొని ఈ పండుగను నిర్వహిస్తుంటారు.
Also Read: రేపటితో ‘హరి హర వీరమల్లు’ చిత్రం షూటింగ్ పూర్తి..విడుదల తేదీపై వీడిన ఉత్కంఠ!
ఇప్పుడు ఇదే సాంప్రదాయాన్ని హైదరాబాదు లో కూడా కొనసాగించాలని ఎక్స్ పీరియం పార్క్ నిర్వాహకులు భావించారు. అందులో భాగంగానే లా టొమాటినాను తెలంగాణకు తీసుకురావడానికి సంకల్పించారు. టమాటా ఫెస్టివల్ లో ప్లీ మార్కెట్, ఫుడ్ స్టాల్స్, డిజె ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. రోజంతా వినోదం అందించే విధంగా విచిత్రమైన సరదా జోన్ కూడా ఏర్పాటు చేశారు. మనదేశంలో బీహార్ రాష్ట్రంలో గతంలో టమాటా ఫెస్టివల్ నిర్వహించాలని భావించారు.. 2013లో బీహార్ రాజధాని పాట్నానగరంలో టమోటా ఫెస్టివల్ నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. అయితే స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో దీనిని నిలిపివేశారు. టమాటా ఫెస్టివల్ వల్ల ఆహారం వృధా అవుతుందని.. చేతులు కష్టపడిన పంట మొత్తం సర్వనాశనం అవుతుందని ప్రజల నుంచి నిరసన వ్యక్తం కావడంతో దానిని రద్దు చేశారు.
దాని వెనుక అంతరార్థం వేరే ఉంది
మే 11 నిర్వహించే టమాటా ఫెస్టివల్ లో.. పూర్తిగా పండిన టమాటలను మాత్రమే వినియోగిస్తున్నారు. కూరకు పనికిరాని టమాటలను మాత్రమే ఫెస్టివల్ కోసం వాడతామని టామ టెర్రా సంస్థ చెబుతోంది. ” ఇది బాధ్యతమైన వేడుక. టమాటాలను వృధా చేయడం అసలు మా ఉద్దేశం కాదు. ఈ పండుగ భవిష్యత్తును ప్రజల ద్వారా వచ్చే స్పందన నిర్ణయిస్తుంది. ఎక్స్ పీరియం పార్కులో దీనిని నిర్వహించడం గొప్ప విషయంగా భావిస్తున్నాం. ప్రజల నుంచి ఇప్పటికే విశేషమైన స్పందన లభిస్తున్నది..ఫెస్టివల్ తర్వాత టమాటా వ్యర్ధాలను ఎరువుగా ఉపయోగిస్తాం. ఇక్కడి పార్కులో మొక్కలకు దీనిని వేస్తాం.. పర్యాటకులు ఒకవేళ ఈ ఫెస్టివల్ ను కనుక ఆస్వాదిస్తే.. భవిష్యత్తు కాలంలో జరుపుతాం.. ఇలాంటి ఫెస్టివల్స్ వల్ల పర్యాటకులు ఈ ప్రాంతాన్ని మళ్లీ మళ్లీ సందర్శించడానికి ఆసక్తి చూపిస్తుంటారు. తద్వారా ఈ పార్కు నిర్వాహకులకు మాత్రమే కాదు.. ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతూ ఉంటుంది. యూరప్ దేశాలు ఇలానే తమ పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకున్నాయి. భారతదేశంలో ఇలాంటి ఫెస్టివల్స్ ఇంతవరకు నిర్వహించలేదు. మే 11న ఈ ఫెస్టివల్ నిర్వహించడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి. పార్క్ నిర్వాహకులు కూడా భారీగానే ఏర్పాట్లు చేశారు. అలాంటప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దీనిని నిర్వహిస్తాం. ఒకవేళ ఈ ఫెస్టివల్ గనుక విజయవంతం అయితే.. భవిష్యత్తు కాలంలోమరిన్ని నిర్వహించడానికి ప్రణాళికల రూపొందిస్తామని” టామా టెర్రా నిర్వాహకులు వెల్లడించారు. అయితే ఈ ఫెస్టివల్ కోసం బాగా పండిన టమాటాలను నిర్వాహకులు సేకరించారు. అయితే ఇవన్నీ కూడా స్థానిక రైతుల నుంచే సేకరించడం విశేషం. టమాటాలు కూరకు పనికిరానివని.. వృధాగా బయట పారబోసే దాని కంటే.. ఇలా ఫెస్టివల్ నిర్వహించి ఎరువుగా వేస్తే ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.