Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై పూర్వ ఆషాడ నక్షత్ర ప్రభావం ఉండనుంది. ఈరోజు శుక్రవారం కావడంతో కొన్ని రాశుల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది దీంతో వ్యాపారులు అనుకోకుండానే అపార ప్రయోజనాలు పొందుతారు. మరి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మిగతా రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారికి స్నేహితులు పెరుగుతారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులకు కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులు కార్యాలయాల్లో సీనియర్ల మద్దతును పొందుతారు. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : కొన్ని మార్గాల ద్వారా వ్యాపారులు లాభపడతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్త పెట్టుబడులు పెడతారు. ఖర్చులు తగ్గించుకోవాలి. ఆదాయం అందంతో మాత్రం గానే ఉంటుంది. అవిశ్వాసం కారణంగా కొన్ని పనులు సక్రమంగా పూర్తి చేయలేరు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈ రోజు దూకుడు స్వభావంతో ఉంటారు. దీంతో కొందరి చేత మాటలు పడాల్సి వస్తుంది. శారీరకంగా అనారోగ్యానికి గురై అవకాశం ఉంది. ఇతరుల నుంచి ధన సహాయం పొందుతారు. కుటుంబ సభ్యులకు కోరిక మేరకు కొన్ని పనులు పూర్తి చేస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : మాటలను అదుపులో ఉంచుకోవాలి. అయినా కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి. ఉద్యోగులకు కార్యాలయాల్లో పోటీ పెరుగుతుంది. దీంతో మనసు భారంగా మారుతుంది. ఆర్థిక వ్యవహారాలు జరిపి వారు జాగ్రత్తగా ఉండాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : మధ్యాహ్న సమయంలో ఆ అనుకోకుండా ధన లాభం పొందే అవకాశం. కొన్ని వస్తువులు కొనుగోలు విషయంలో డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. పిల్లల కోసం కొత్త కొత్త పెట్టుబడులు పెడతారు. వివాహ ప్రయత్నాలు మొదలవుతాయి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : కొన్ని విషయాలను కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. చిన్న వివాదం ఏర్పడే అవకాశం ఉంది. అయితే మాటలను అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారులకు ఆర్థిక లాభాలు ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : వ్యాపారులు ప్రత్యేకంగా ధన సహాయం పొందుతారు. ఉద్యోగులు అనుకున్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఒక వ్యక్తి విజయం ఇంకా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటుంది. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. అయితే ఆర్థిక ప్రయోజనాలు పొందడంలో నిరాశపడతారు. సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ఒకరి అనారోగ్య కారణాలవల్ల ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుంది.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగులు ప్రశంసలు పొందుతారు. కొన్ని ఆశ్చర్యకరమైన పనులు పూర్తి చేస్తారు. వినోదాల కోసం డబ్బులు ఖర్చు చేస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : మానసిక ఒత్తిడి తో ఉండడం వలన ఏ పనిని సకాలంలో పూర్తి చేయలేరు. పెండింగ్ బకాయిల వసూలు పై దృష్టి పెడతారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేస్తారు. వ్యాపారులు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ప్రభుత్వ జోక్యం తో కొన్ని పనులు పూర్తి అవుతాయి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఆర్థిక సంబంధించిన విషయంలో శుభవార్త వింటారు. విదేశాల్లో ఉండేవారు నుంచి కీలక సమాచారం పొందుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. నిర్ణీత కడుపులో ఒక పనిని పూర్తి చేయడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. తోటి వారి సహకారంతో ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు. వ్యాపారులకు ధన లాభం ఉంటుంది. కొన్ని బాధ్యతలు ఉండడం వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది.