Homeఆంధ్రప్రదేశ్‌Times Now Survey YCP: క్లీన్ స్వీపా? ఏపీలో మరోసారి జగన్ దే గెలుపా? నిజమెంత?

Times Now Survey YCP: క్లీన్ స్వీపా? ఏపీలో మరోసారి జగన్ దే గెలుపా? నిజమెంత?

Times Now Survey YCP
Times Now Survey YCP

Times Now Survey YCP: ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందా? ఆ పార్టీ నేతలు చెబుతున్నట్టు వైనాట్ 175 సాధ్యమవుతుందా? వచ్చే ఎన్నికల్లో ఏకపక్ష విజయం దక్కనుందా? తాజా సర్వేలో ఇదే అంశం తేలిందా? అయితే ఇందులో నిజమెంత? సర్వేకు పారదర్శకత ఎంత? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. దేశ వ్యాప్తంగా టైమ్స్ నౌ ఈటీజీ చేసిన సర్వే ఒకటి వెల్లడైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరిది విజయం? అన్న అంశంపై సంస్థ సర్వే చేసింది. సర్వే అంశాలను వెల్లడించింది. ఇప్పుడు ఈ సర్వే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైసీపీకి ఏకపక్ష విజయమంటూ ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ ప్రచారంతో హోరెత్తిస్తోంది. ఇంతకీ సర్వేలో వెల్లడైన ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.

అగ్రస్థానంలో మోదీ..
కేంద్రంలో ఏ పార్టీకి అధికారంలోకి వస్తుంది? నేతల పనితీరు ఎలా ఉంది? అన్న ప్రాతిపదికన సర్వే చేశారు. అయితే ప్రధాని మోదీ మేనియా అమాంతం పెరిగినట్టు తేలింది. మోదీకి ఏకంగా 64 మంది మద్దతు తెలపడం విశేషం. ఆ తరువాత స్థానంలో కాంగ్రెస్ యువనేత రాహుల్ నిలిచారు. ఆయనకు 13 మంది మద్దతుపలికారు. తరువాత స్థానంలో కేజ్రీవాల్ 12, నితీష్ 6, కేసీఆర్ 5 శాతం మద్దతు పొందగలిగారు. ప్రధాని మోదీ తిరుగులేని ఆధిక్యతను కొనసాగించడం విశేషం. ఎవరూ అందుకోలేని స్థితిలో ప్రజాభిమానం చూరగొనడం విశేషం. ఇటీవల పరిణామాలతో ప్రధాని మోదీ ప్రాభవం మసకబారిందనుకుంటున్న తరుణంలో ఆయన ప్రజాభిమానం చూరగొన్నారని సర్వే చెబుతుండడం విశేషం. అటు రాహుల్ గాంధీ రెండెంకల శాతాన్ని దక్కించుకోవడం సంతృప్తికరం.

ఎన్డీఏకు మూడో చాన్స్..
అటు సీట్లపరంగా కూడా బీజేపీతో పాటు ఎన్డీఏ కూటమి ముందంజలో నిలిచింది. 292 నుంచి 338 సీట్లు వరకూ ఆ పార్టీ దక్కించుకునే చాన్స్ ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ తో పాటు ఇతర పక్షాలు కేవలం 106 నుంచి 144 వరకూ మాత్రమే సీట్లు వచ్చే అవకాశముందని తేలింది. ఈ లెక్కన మూడోసారి బీజేపీ కూటమి అధికారంలోకి రానుందని టైమ్స్ నౌ తేల్చేసింది. అయితే ఏపీలో మాత్రం అధికార వైసీపీ 24 నుంచి 25 సీట్లు దక్కించుకుంటుందని సర్వే తేల్చడంపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఈ సర్వేను వైసీపీ శ్రేణులు ఆహ్వానిస్తున్నాయి. 90 శాతం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి సంతృప్తికర స్థాయిలో ఉంచామని.. 175 సీట్లకు దగ్గరగా గెలుచుకుంటామని వారు గంటా పథంగా చెబుతున్నారు.

Times Now Survey YCP
Times Now Survey YCP

తేలికగా తీసుకుంటున్న విపక్షాలు..
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ సర్కారుపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది. మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం ఇదే స్పష్టమైంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. కానీ వైసీపీ మాత్రం అవన్నీ తమ వ్యతిరేక వర్గాలని.. తమ ప్రభుత్వం లబ్ధి చేకూర్చిన వర్గాలన్నీ తమ వెంటే నడుస్తాయని చెబుతూ వస్తోంది. ఇప్పుడు టైమ్స్ నౌ సంస్థ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ సర్వే ఫలితాలను వైసీపీకి అనుకూలంగా కట్టబెట్టడం అనుమానాలకు తావిస్తోంది. అదంతా ఒట్టి సర్వేనని.. ప్రతికూల ప్రభావం అధిగమించేందుకు వైసీపీ చేస్తున్న డ్రామాగా విపక్షాలు కొట్టి పారేస్తున్నాయి. విపరీతమైన ప్రజా వ్యతిరేకత పెల్లుబికుతున్న వేళ 24, 25 లోక్ సభ స్థానాలు సాధ్యమా అని ప్రశ్నిస్తున్నాయి. సర్వేను చాలా తేలికగా తీసుకుంటున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular