
Tiktok tarun : పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అంటారు పెద్దలు. ఈ సామెత తీరుగానే ఉన్నది ఇప్పటి యువతరం తీరు. అరచేతిలో స్మార్ట్ ఫోన్, అపరిమితమైన డాటా, సులువుగా ఆపరేట్ చేయగలిగే యాప్స్.. ఇంకేముంది వారిలో ఉన్న అసలు రూపం బయటికి వస్తోంది. ఇది ఒక మోతాదు వరకు బాగానే ఉంటుంది. కానీ ఇది శ్రుతి మించుతోంది. చేసేవారికి సిగ్గూశరం లేకున్నా చూసేవారికి ఎబ్బెట్టుగా ఉంటోంది. అప్పట్లో టిక్‌టాక్ అనే యాప్ ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేవారు. ఈ టిక్ టాక్ యాప్ ద్వారానే చాలా మంది బయటి ప్రపంచానికి తెలిశారు. విజయవాడకు చెందిన దీపికా పిల్లి, దుర్గారావు దంపతులు, ఉప్పల్ బాలు ఇలా టిక్ టాక్ వీడియోలు చేసే సెలబ్రిటీలు అయ్యారు. ఇందులో దీపికా పిల్లి తన గ్లామర్ ద్వారా అనేక అవకాశాలు దక్కించుకుంటోంది. దుర్గారావు తన భార్యతో కలిసి వీడియోలు చేస్తున్నాడు. ఇక ఉప్పల్ బాలు కూడా బాగానే ఫేమస్ అయ్యాడు.
https://www.youtube.com/watch?v=EAa7vyhURsU
కేంద్రం టిక్ టాక్ యాప్‌ను నిషేధించడంతో ఫేస్‌బుక్, ఇన్ స్టా గ్రామ్ రీల్స్ అనే యాప్షన్‌ను తెరపైకి తీసుకొచ్చాయి. యూట్యాబ్‌లో కూడా ఈ అవకాశాన్ని కల్పించింది. దీంతో వర్థమాన కళాకారులు తమ కళా నైపుణ్యాన్ని, వీడియోలను అందులో అప్ లోడ్ చేస్తున్నారు. టిక్ టాక్ నిషేధం ద్వారా జరిగిన నష్టాన్ని వీటిద్వారా భర్తీ చేసుకుంటున్నారు. ఆదాయం కూడా దండిగా ఉండటంతో రీల్స్ చేయడంలో ఉత్సాహం చూపిస్తున్నారు. పైగా గతంలో మాదిరి నిబంధనల అడ్డంకి లేకపోవడంతో విశృంఖలత్వం పెరిగిపోతోంది. కొన్ని కొన్ని రీల్స్ అయితే చూసేందుకు ఎబ్బెట్టుగా ఉంటున్నాయి.
ఇక కొందరయితే చిత్ర విచిత్రమైన రీల్స్ చేస్తున్నారు. అదేం దరిద్రమో గానీ.. ‘గే’ మాదిరి ముస్తాబయి, చెండాలమైన డ్రస్సుల వేసుకుని రీల్స్ చేస్తున్నారు. గతంలో ఉప్పల్ బాలు కూడా ఇలానే చేసేవాడు. అతగాడు ఫేమస్ అయ్యాడని చాలా మంది అదే రూట్‌లో వెళ్తున్నారు. టిక్‌టాక్ లాంటి యాప్ మోజోలో కూడా చాలా మంది రీల్స్ చేస్తున్నారు. ఈ యాప్ ద్వారా చాలా మంది ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో నవనీత్ ఒకడు. ఇతగాడు ‘గే’ వేషాలు వేస్తుంటాడు. దానికి తగ్గట్టుగా బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ ఎంచుకుంటాడు. మొదట్లో ఇది బాగానే ఉండేది. కానీ ఈ మధ్య అతడి ఽధోరణి శ్రుతి మించిపోయింది. చిత్రవిచిత్రమైన డ్రెస్సులు, వేషధారణతో చిరాకు తెప్పిస్తున్నాడు. అతగాడి ధోరణి చూసిన నెటిజన్లు ‘మగ పుట్టుక పుట్టి ఇదేం పద్ధతిరా బాబూ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
