Tiger Woods: డోనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన ఏదో ఒక వార్త ప్రపంచాన్ని షేక్ చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాను, ప్రధాన మీడియాను ఊపేస్తున్న వార్త డోనాల్డ్ ట్రంప్ పరిపాలనకు సంబంధించింది కాదు. ఆయన తీసుకున్న సంచలన నిర్ణయమూ కాదు. ట్రంప్ కుటుంబంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు అమెరికానే కాదు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విలాస పురుషుడు అని అందరికీ తెలుసు. ఆమధ్య ఓ పెద్దల చిత్రాల నటితో జరిగిన వివాదం.. ఎదుర్కొన్న ఆరోపణలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ట్రంప్ మాజీ కోడలు వ్యవహారం సంచలనంగా మారింది. ట్రంప్ కుమారుడు డోనాల్డ్ ట్రంప్ జూనియర్ కు 13 సంవత్సరాల క్రితం వెనెస్సా తో వివాహం జరిగింది. వీరికి ఐదుగురు పిల్లలు.. అయితే 2018లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. నాటి నుంచి వారు విడిగానే ఉంటున్నారు. పిల్లల బాధ్యత వెనెస్సా చూసుకుంటున్నది. వెనెస్సా, టైగర్ వుడ్స్ కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నట్టు తెలుస్తోంది ఈ విషయాన్ని అమెరికా మీడియా కూడా గతంలో వెల్లడించింది. అయితే అవన్నీ ఉత్తి పుకార్లని కొంతమంది ఖండించినప్పటికి.. ఇప్పుడు అసలు నిజం అదేనని తెలుస్తోంది. ఎందుకంటే తమ ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని టైగర్ వుడ్స్ బయటి ప్రపంచానికి తెలియజేశాడు.” మా హృదయాలను దగ్గరగా చూసిన వారందరూ మా గోప్యత కు భంగం కలిగించారని ఆశిస్తున్నామని” వుడ్స్ వ్యాఖ్యానించాడు.
Also Read: పవన్ కి పెద్ద తలనొప్పిగా మారిన నాగబాబు..టీడీపీ, వైసీపీ ఏకం అయ్యాయిగా!
విలాస పురుషుడు
టైగర్ వుడ్స్ అమెరికాలో పేరు పొందిన గోల్ఫ్ ఆటగాడు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఆటగాడిగా అతడు అప్పట్లో రికార్డు సృష్టించాడు. వివాహేతర సంబంధాల వల్ల ఒక్కసారిగా తన ప్రభను కోల్పోయాడు. అతడి స్త్రీ వ్యామోహం చూసి భార్య విడాకులు ఇచ్చింది. కొద్దిరోజులపాటు టైగర్ వుడ్స్ డిప్రెషన్ లోకి వెళ్ళినప్పటికీ.. ఆ తర్వాత తేరుకున్నాడు. మళ్లీ తన పాత జీవితాన్ని ప్రారంభించాడు. చాలామంది అమ్మాయిలతో సహజీవనం చేశాడు. ఐదుగురు పిల్లలకు తల్లైన వెనెస్సా తో అతడు ఇప్పుడు కొత్త సంబంధాన్ని మొదలుపెట్టాడు. కొద్ది నెలల నుంచే వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధం కొనసాగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల టైగర్ వుడ్స్ తో ఓ సినిమా నిర్మించేందుకు సంకల్పించాడు. అయితే అది టైగర్ వుడ్స్ బయోపిక్ అని తెలుస్తోంది. మొత్తానికి తన సంబంధాల ద్వారా, తన వ్యవహారాల ద్వారా టైగర్ వుడ్స్ మరోసారి వార్తల్లో వ్యక్తయ్యాడు. అయితే టైగర్ వుడ్స్ కు తన మాజీ భార్య ద్వారా పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఆమె వద్దే ఉంటున్నారు. ఇటీవల వుడ్స్ తన కుమారుడితో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది ఆహ్లాదకరమైన సమయం అంటూ దానికి కామెంట్ చేశాడు.
View this post on Instagram