Homeఎంటర్టైన్మెంట్This Week OTT Release Movies: ఈ వారం OTT ప్రేక్షకులకి పండగే..వీకెండ్ లో క్రేజీ...

This Week OTT Release Movies: ఈ వారం OTT ప్రేక్షకులకి పండగే..వీకెండ్ లో క్రేజీ మూవీస్ విడుదల

This Week OTT Release Movies: లాక్ డౌన్ సమయం లో OTT కి బాగా అలవాటు పడిపోయిన ప్రేక్షకులు విడుదలై సూపర్ హిట్టైన కొత్త సినిమాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు..అలాంటి ప్రేక్షకులకు ఈ వారం పండగే అని చెప్పొచ్చు..థియేటర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచినా సినిమాలతో పాటుగా క్రేజీ వెబ్ సిరీస్ లు కూడా అందుబాటులోకి రానున్నాయి..వారం మొత్తం పనులు చేసి అలసిపోయిన వారికి ఈ వీకెండ్ అన్ లిమిటెడ్ […]

This Week OTT Release Movies: లాక్ డౌన్ సమయం లో OTT కి బాగా అలవాటు పడిపోయిన ప్రేక్షకులు విడుదలై సూపర్ హిట్టైన కొత్త సినిమాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు..అలాంటి ప్రేక్షకులకు ఈ వారం పండగే అని చెప్పొచ్చు..థియేటర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచినా సినిమాలతో పాటుగా క్రేజీ వెబ్ సిరీస్ లు కూడా అందుబాటులోకి రానున్నాయి..వారం మొత్తం పనులు చేసి అలసిపోయిన వారికి ఈ వీకెండ్ అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ..ఇంతకీ ఈ వీకెండ్ OTT లో విడుదల అవ్వబోతున్న ఆ క్రేజీ మూవీస్ మరియు వెబ్ సిరీస్ ఏంటో ఒక లుక్ వేద్దాం.

గాడ్ ఫాదర్:

Godfather

దసరా కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే..మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచినా మోహన్ లాల్ లూసిఫెర్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం మెగాస్టార్ స్టైల్ లో ఆయన బాడీ లాంగ్వేజ్ కి మరియు తెలుగు నేటివిటీ కి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచారు డైరెక్టర్ మోహన్ రాజా..ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో నవంబర్ 18 వ తారీకు నుండి..అనగా రేపటి నుండి తెలుగు మరియు హిందీ బాషలలో స్ట్రీమింగ్ కానుంది..థియేటర్ లో మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ చిత్రం OTT లో ఎలాంటి రెస్పాన్స్ ని రప్పించుకుంటుందో చూడాలి.

సర్దార్ :

ఇటీవల కాలం లో సైలెంట్ గా వచ్చి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సినిమాలలో ఒకటి సర్దార్..కార్తీ హీరో గా, ప్రముఖ దర్శకుడు మిత్రన్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు మరియు తమిళం బాషలలో సూపర్ హిట్ గా నిలిచి వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను సాధించింది..కార్తీ కి ఈ ఏడాది ఇది వరుసగా మూడవ హిట్..అంటే హ్యాట్రిక్ హిట్ అన్నమాట..ఒక చక్కటి సందేశం తో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం నవంబర్ 18 వ తారీకు నుండి ఆహా లో స్ట్రీమింగ్ కానుంది.

Sardar

అహనా పెళ్ళంట:

ప్రముఖ యువ హీరో రాజ్ తరుణ్ తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ ఇది..ఈ సిరీస్ లో హీరో రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ హీరోయిన్ గా నటిస్తుంది..పెళ్లయ్యే వరుకు ఏ అమ్మాయితో కూడా ప్రేమలో పడను అని తల్లికి మాట ఇచ్చిన యువకుడు ఒక అమ్మాయి ప్రేమలో పడుతాడు..మరి అమ్మాయి తల్లి చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా..లేక ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా అనేది స్టోరీ..జీ 5 యాప్ లో ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.

 

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Oktelugu Epaper