Pawan Kalyan OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాలలో ఒకటి #OG.ప్రముఖ యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం గత 20 రోజుల నుండి శరవేగంగా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.ఈ చిత్రాన్ని #RRR మూవీ మేకర్స్ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్నారు.ఈ చిత్రం లో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా, సంగీత సంచలనం థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.
మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే మొదటి షెడ్యూల్ ని ముంబై లో పూర్తి చేసుకొని, ఇప్పుడు రెండవ షెడ్యూల్ పూణే లో జరుపుకుంటుంది, ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ మరియు ప్రియాంక మధ్య ఒక పాటని చిత్రీకరిస్తున్నారు.ఈ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ లో సరికొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.అదేమిటంటే ఈ సినిమా మూడవ షెడ్యూల్ పూర్తి అవ్వగానే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతున్నారట. అది ఈ నెలలోనే విడుదల చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.#OG కి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్, మూవీ టీం విడుదల చేస్తున్న ప్రతీసారీ సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది.
కేవలం వర్కింగ్స్ స్టిల్స్ తోనే ఆ రేంజ్ ప్రభంజనం సృష్టిస్తే, ఇక ఫస్ట్ లుక్ విడుదల రోజు సోషల్ మీడియా ఏ రేంజ్ లో అనబోతుందో ఊహించుకోవచ్చు.ఈ సినిమాని ఎట్టి పరిస్థితిలో ఈ ఏడాదే పూర్తి చేసి, డిసెంబర్ నెలలో విడుదల చేయూయ్యబోతున్నట్టు ఒక టాక్ వినిపిస్తుంది.మరి అనుకున్న సమయానికి సినిమా పూర్తి అవుతుందో లేదో చూడాలి.