https://oktelugu.com/

Photo Story: ఈ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో… ఎవరో తెలిస్తే షాకవుతారు..

Photo Story: ఒక్క ఫొటో లక్షల మెదళ్లను కదిలిస్తుందని అంటారు. జ్ఞాపకాలు పదిలంగా ఉండేందుకు ఫొటో ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యమైన కొన్ని విషయాలను ఫొటోల ద్వారా తెలుసుకోవచ్చు. ఇక మన చిన్ననాటి గుర్తులు, ఇతర విషయాలను ఫొటోల్లో బంధించుకొని వాటిని పెద్దయ్యాకు చూసి మురిసిపోతుంటాం. సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది నటులు తమ చిన్నప్పటి విషయాలను ఫొటోల ద్వారా భద్రపరిచారు. వాటిని సందర్భాన్ని భట్టి బయటపెడుతున్నారు. లేటేస్టుగా ఓ స్టార్ హీరో చిన్నప్పటి ఫొటో సోషల్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 30, 2023 / 04:11 PM IST
    Follow us on

    Nithiin

    Photo Story: ఒక్క ఫొటో లక్షల మెదళ్లను కదిలిస్తుందని అంటారు. జ్ఞాపకాలు పదిలంగా ఉండేందుకు ఫొటో ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యమైన కొన్ని విషయాలను ఫొటోల ద్వారా తెలుసుకోవచ్చు. ఇక మన చిన్ననాటి గుర్తులు, ఇతర విషయాలను ఫొటోల్లో బంధించుకొని వాటిని పెద్దయ్యాకు చూసి మురిసిపోతుంటాం. సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది నటులు తమ చిన్నప్పటి విషయాలను ఫొటోల ద్వారా భద్రపరిచారు. వాటిని సందర్భాన్ని భట్టి బయటపెడుతున్నారు. లేటేస్టుగా ఓ స్టార్ హీరో చిన్నప్పటి ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చిన్నప్పుడు ఎంతో ముద్దుగా ఉండే ఈ హీరో ఇప్పుడు కూడా అమ్మాయిల అభిమానిగా మారి అలరిస్తున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో చూద్దాం.

    ముద్దుగా, బొద్దుగా ఉండే ఈ చిన్నోడిని ఒకాయన ఎత్తుకొని ఉన్నారు. ఆయన పిల్లాడి తండ్రి. ఆయన పేరు సుధాకర్ రెడ్డి. ఈయన డిస్ట్రిబ్యూటర్ గా పేరొందాడు. ఈయన కుమారుడే నితిన్. కొత్త యువకులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసే తేజ డైరెక్షన్లో వచ్చిన ‘జయం’ సినిమా నాటి యూత్ కు తెలిసే ఉంటుంది. లవ్ ఎమోషనల్ మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాలో నితిన్ హీరో. ఈయన మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆ తరువాత సంబరం సినిమా చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ వివివినాయక్ డైరెక్షన్లో వచ్చిన ‘దిల్’ సినిమాతో నితిన్ మాస్ హీరో అనిపించుకున్నారు.

    Nithiin

    అప్పటి నుంచి హిట్టు, ఫట్టులతో సంబంధం లేకుండా నితిన్ ఇప్పటి వరకు 27 సినిమాల్లో నటించారు. ఇందులో ‘అగ్యాత్’ అనే హిందీ సినిమాలో కూడా నటించాడు. నితిన్ సినీ కెరీర్ లో ఎక్కువ లవ్ కామెడీ సెంటిమెంట్ సినిమాల్లోనే నటించారు. అందుకే ఆయన లవర్ బాయ్ గా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో ఆయనకు లేడీ ఫ్యాన్స్ విపరీతంగా పెరిగారు. ఆయన నటించిన ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలు వరుసగా హిట్టు కొట్టడంతో మిగతా హీరోలకు పోటీనిచ్చాడు. కానీ ఆ తరువాత వచ్చిన సినిమాలో యావరేజ్ కావడంతో నితిన్ కు అవకాశాలు తగ్గాయని అంటున్నారు.

    1983 మార్చి 30న నితిన్ నిజామాబాద్ లో జన్మించారు. తండ్రి డిస్ట్రిబ్యూటర్ అయనందున ఆయనకు సినిమాలపై ఆసక్తి పెరిగింది. తొలిప్రేమ సినిమా చూసిన తరువాత సినిమాల్లో నటించేందుకు తీవ్రంగా కృషి చేశాడు. ఇక హీరోగా అయిన తరువాత ఓ సినిమాలో ఆయన తొలిప్రేమలోని సాంగ్ ను రీమేక్ చేసి నటించిన విషయం తెలిసిందే. మార్చి 30న నితిన్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు నితిన్ బర్త్ డే విషేస్ పోస్టర్లతో హల్ చల్ చేస్తున్నారు.