
Uttar Pradesh: ప్రేమ.. ఎంతో పవిత్రమైన, విలువైన పదం.. తల్లిదండ్రులు, పిల్లల మధ్య, స్నేహితుల మధ్య, ప్రియుడు ప్రేయసి మధ్య, పెంపుడు జంతువులు, యజమాని మధ్య సాధారణంగా చూస్తుంటాం. ప్రేమే అనుబంధాలను పెంచుతుంది.. దూరం తగ్గిస్తుంది. తాజాగా ఓ పక్షి, మనిషి మధ్య చిగురించిన ప్రేమ వారిని ఏడాదిగా కలిపే ఉంచుతుంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియని పక్షి తన పొలంగా గాయంతో కనిపించడంతో చేరదీసినందుకు అంతకన్నా ఎక్కువగా తనను రక్షించిన వ్యక్తిపై ప్రేమను చూపుతోంది ఆ పక్షి. విడిచి వెళ్లడానికి కూడా ఇష్టపడడం లేదు. ఈ వింతైన, విచిత్రమైన ప్రక్షి, మనిషి ప్రేమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అమేఠి జిల్లా మండ్కా గ్రామంలో ఏడాదిగా కొనసాగుతోంది.
గాయపడి పొలంలో ఉన్న పక్షి..
భారీ కొంగ జాతికి చెందిన పక్షి మండ్కా గ్రామానికి చెంది మహ్మద్ ఆరీఫ్ పొలంలో వాలిపోయింది. ఆరీఫ్ పొలం వద్దకు వెళ్లే సరికి భారీ సైజులు ఉన్న కొంగ జాతి పక్షిని చూసి భయపడ్డాడు. అయితే అది అక్కడి నుంచి ఎగిరిపోకపోవడం, కుంటుతూ నడవడంతో దూరం నుంచే పరిశీలించాడు. కాలు విరిగిపోయి రక్తం కారుతూ కనిపించింది. దీంతో పక్షి ఆపదలో ఉందని గుర్తించిన ఆరీఫ్ దగ్గరకు వెళ్లాలనుకున్నాడు. కానీ దాని పొడవైన ముక్కు చూసి పొడుస్తుందేమో అని భయపడ్డాడు. కాసేపు ఆలోచించి ధైర్యం చేసి దాని దగ్గరకు వెళ్లి కాలును పరిశీలించాడు. పక్షి ఏమీ అనకపోవడంతో ఇంటికి తీసుకెళ్లాడు. తనకు తెలిసిన వైద్యం చేసి కాలుకు కట్టు కట్టాడు.
నెల రోజుల్లో పెరిగిన అనుబంధం..
పక్షి కోలు కోవడానికి నెల రోజులు పట్టింది. దీంతో ఆరీఫ్ ఇంట్లో వారితో ఆ పక్షికి అనుబంధం పెరిగింది. వారు తినే రొట్టె అన్నం, కుర్మా, పండ్లను దానికి తినిపించారు. దీంతో ఆరీఫ్‌తోపాటు అందరితో అనుబంధం ఏర్పడింది. నెలన్నర రోజుల్లో పక్షి కాలు కూడా సరైంది. దీంతో తర్వాత అది తన స్థావరానికి ఎగిరిపోతుందని ఆరిఫ్ భావించాడు. కానీ అది వెళ్లలేదు. ఆరీఫ వద్దనే ఉంటోంది.
ఎటు వెళ్లినా ఆయన వెంటే..
ఆరీఫ్ ఎటు వెళ్లినా సదరు పక్షి కూడా ఆయన వెంటే వెళ్తోంది. పట్టణాలక వెళ్లినప్పుడు కూడా ఆరీఫ్ బైక్‌పై వెళ్తుంటే పక్షి ఆయన తల పక్కనే ఎగురుతూ ముందుకు సాగుతుంది. ఏదైనా పెద్ద వాహనాలు ఎదురుగా వచ్చినప్పుడు ఎత్తుకు వెళ్లి తర్వాత కిందకు వస్తుంది. మంచి ఫ్రెండ్‌గా ఆరీఫ్‌తో ఉంటుంది. అడవి పక్షి తనతో పెంచుకున్న అనుబంధం చూపి ఆరీఫ్ కూడా మురిపిసోతున్నాడు. ప్రేమగా చూసుకుంటున్నాడు.
ఉదయం వెళ్లి సాయంత్రం ఇంటికి..
ఇక ఆ పక్షిని ఆరిఫ్ ఎప్పుడూ బంధించలేదు. స్వేచ్ఛగా తిరుగుతుంది. గ్రామంలోని వారు కూడా దానికి ఎలాంటి హాని చేయడం లేదు. పక్షి ఉదయం బయటకు వెళ్తుంది. ఎంత దూరం వెళ్లినా సాయంత్రానికి మాత్రం తిరిగి ఇంటికి చేరుకుంటుంది. ఈ ఏడాదిలో ఇంటికి రాని రోజు లేదంటున్నాడు ఆరీఫ్. తాను ఎప్పుడైనా దానిని బంధించి ఉంటే అది తనపై ఇంత ప్రేమ చూపేది కాదని పేర్కొంటున్నాడు.

ఈ పక్షి తనకు దేవుడు ఇచ్చిన వరం అంటున్న ఆరిఫ్, ఆపదలో ఉన్నప్పుడు నేను మానవత్వంతో చేసిన సేవకు ఆ మూగ జీవి తనతో ఇంత ప్రేమగా ఉండడం ఆనందంగా ఉందంటున్నాడు.