Mahesh Babu – Trivikram : మహేష్ మూవీ టైటిల్… త్రివిక్రమ్ అ సెంటిమెంట్ వదల్లేదా!

Mahesh Babu – Trivikram : చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్స్ బాగా ఎక్కువ. టైటిల్, కాంబినేషన్, రిలీజ్ డేట్స్, సీజన్స్ ఇలా అనేకం నమ్ముతారు. మహేష్ చాలా కాలం మూడు అక్షరాల టైటిల్ సెంటిమెంట్ కొనసాగించారు. ఇక బాలయ్య అయితే టైటిల్ లో సింహం ఉండేలా చూసుకుంటారు. దర్శకుడు త్రివిక్రమ్ కి కూడా ఓ సెంటిమెంట్ ఉంది. ఆయన తెరక్కించే ప్రతి సినిమా టైటిల్ ‘అ’ అక్షరంతో మొదలయ్యేలా చూసుకుంటారు. అతడు చిత్రంతో త్రివిక్రమ్ అ అక్షరం […]

Written By: NARESH, Updated On : March 14, 2023 7:58 pm
Follow us on

Mahesh Babu – Trivikram : చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్స్ బాగా ఎక్కువ. టైటిల్, కాంబినేషన్, రిలీజ్ డేట్స్, సీజన్స్ ఇలా అనేకం నమ్ముతారు. మహేష్ చాలా కాలం మూడు అక్షరాల టైటిల్ సెంటిమెంట్ కొనసాగించారు. ఇక బాలయ్య అయితే టైటిల్ లో సింహం ఉండేలా చూసుకుంటారు. దర్శకుడు త్రివిక్రమ్ కి కూడా ఓ సెంటిమెంట్ ఉంది. ఆయన తెరక్కించే ప్రతి సినిమా టైటిల్ ‘అ’ అక్షరంతో మొదలయ్యేలా చూసుకుంటారు. అతడు చిత్రంతో త్రివిక్రమ్ అ అక్షరం సెంటిమెంట్ మొదలుపెట్టారు. ఈ మధ్య వదలకుండా ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు.

అ ఆ చిత్రం తర్వాత త్రివిక్రమ్ చేసిన చిత్రాల టైటిల్స్ అన్నీ అ అక్షరంతో మొదలైనవే. అజ్ఞాతవాసి, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురంలో చిత్రాల్లో మొదటి అక్షరం అ ఉండటం మనం చూడొచ్చు. ప్రస్తుత మహేష్ చిత్రానికి కూడా టైటిల్ ఈ తరహాలోనే ఉంటుందట. త్రివిక్రమ్ కథకు సరిపోయేలా… అ అక్షరంతో మొదలయ్యే టైటిల్ వేటలో ఉన్నారట. త్వరలో మహేష్ ఫ్యాన్స్ ని మెప్పించే టైటిల్ ప్రకటన చేస్తారట.

ప్రస్తుతం మహేష్-త్రివిక్రమ్ మూవీ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. భారీ లగ్జరీ హౌస్ సెట్ ఏర్పాటు చేశారు. దీని కోసం ఏకంగా రూ. 10 కోట్లు కేటాయించారట. హీరోయిన్ పూజా హెగ్డేతో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటున్నట్లు సమాచారం. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతిబాబు కీలక రోల్స్ చేస్తున్నట్లు వినికిడి. యంగ్ బ్యూటీ శ్రీలీలను ఒక క్రేజీ రోల్ కోసం తీసుకున్నారట.

ఇప్పటికే షూటింగ్ ఆలస్యమైన నేపథ్యంలో నిరవధికంగా తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ కల్లా దాదాపు చిత్రీకరణ పూర్తి చేస్తారట. మిగిలిన ఒక పాట, ఫైట్ తర్వాత కంప్లీట్ చేసి విడుదలకు సిద్ధం చేస్తారట. ఆగస్టు లేదా దసరా కానుకగా మూవీ విడుదల చేసే అవకాశం కలదంటున్నారు. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారట. ఈ చిత్రంలో కేవలం మూడు ఫైట్స్ మాత్రమే ఉంటాయనే ప్రచారం జరుగుతుంది.