మందు బంద్: మద్యం ప్రియులకు షాక్

అసలే హోలీ పండుగ.. ధావత్ లకు మంచి సందర్భం.. పైగా ఆదివారం కలిసి వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ధూమ్ ధామ్ గా పండుగ సాగుతోంది. రంగులు పూసుకొని విందు, చిందుల్లో ప్రజలంతా మునిగిపోయారు. కానీ సాయంత్రానికి మందుకు కూర్చుందామంటే అందరికీ షాక్.. ఓ పెగ్ వేసుకొని.. ఎండల్లో చల్లటి బీరు తాగుదామన్నా కూడా కష్టంగా మారింది. ఎందుకంటే మందు బంద్ చేశారు.ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 48 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం […]

Written By: NARESH, Updated On : March 28, 2021 11:25 am
Follow us on

అసలే హోలీ పండుగ.. ధావత్ లకు మంచి సందర్భం.. పైగా ఆదివారం కలిసి వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ధూమ్ ధామ్ గా పండుగ సాగుతోంది. రంగులు పూసుకొని విందు, చిందుల్లో ప్రజలంతా మునిగిపోయారు. కానీ సాయంత్రానికి మందుకు కూర్చుందామంటే అందరికీ షాక్.. ఓ పెగ్ వేసుకొని.. ఎండల్లో చల్లటి బీరు తాగుదామన్నా కూడా కష్టంగా మారింది. ఎందుకంటే మందు బంద్ చేశారు.ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 48 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించింది తెలంగాణ సర్కార్.

హోలీ పండుగ నేపథ్యంలో రాబోయే రెండు రోజుల పాటు మద్యం షాపులు బంద్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి మద్యం అందుబాటులో ఉండదు. తిరిగి మంగళవారం సాయంత్రం వైన్ షాపులు తెరుచుకుంటాయి.

హోలీ వేడుకలు, కరోనా కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక హోలీ వేడుకలపై కూడా తీవ్ర ఆంక్షలు విధించింది. సెకండ్ వేవ్ ప్రబలుతుండడం.. రోజురోజుకు పెరుగుతున్న కేసులు దృష్ట్యా హోలీ వేడుకలు జరుపకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

చివరికి గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్ మెంట్లు, కాలన్నీ కూడా వేడుకలు జరుగకుండా పోలీసులు నిఘా ఏర్పాటు చేసి తిరుగుతున్నారు. హోలీతోపాటు ఉగాది, రంజాన్, గుడ్ ఫ్రైడ్, శ్రీరామనవమి వేడుకలు కూడా నిర్వహించకూడదని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

ఏప్రిల్ 10 వరకు తెలంగాణలో కరోనా ఆంక్షలను విధించింది ప్రభుత్వం.ఎవరి ఇళ్లలో వారు హోలీ సహా అన్ని వేడుకలు జరుపుకోవాలని ప్రభుత్వం సూచించింది. లేదంటే కేసులు పెడుతామని హెచ్చరించింది.