Kantara Mother Character: కాంతార చిత్రం ఈ దశాబ్దంలో ఒక సంచలనం. కాంతార చిత్ర బడ్జెట్ రూ. 20 కోట్లు లోపే. కానీ ఆ చిత్ర వరల్డ్ వైడ్ వసూళ్లు రూ. 406 కోట్లు. అంటే పెట్టుబడికి ఇరవై రెట్లు వసూళ్లు సాధించిందన్న మాట. ఉదాహరణకు రూ. 500 కోట్ల బడ్జెట్ మూవీ రూ. 10000 వేల కోట్ల వసూళ్లతో సమానం అన్న మాట. ఆర్ ఆర్ ఆర్ , కెజిఎఫ్ 2 విజయాలు కాంతార ముందు దిగదుడుపే. దర్శకుడు రిషబ్ శెట్టి మ్యాజిక్ చేశాడు. దర్శకుడిగా, నటుడిగా అద్భుతం చేశాడు. విడుదలైన అన్ని భాషల్లో కాంతార బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తెలుగులో కేవలం రూ. 2 కోట్లకు అల్లు అరవింద్ కొన్నారు. రూ. 32 కోట్లకు పైగా షేర్ రాబట్టింది.

కాంతార చిత్ర క్లైమాక్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. కొన్ని నిమిషాల పాటు వేరే ప్రపంచంలో విహరింపజేసింది. థియేటర్ నుండి బయటకు వచ్చాక కూడా ప్రేక్షకుడు ఆ చిత్రంలో నుండి బయటకు రాలేదు. కాంతార చిత్రం మదిని వెంటాడుతుంది. సినిమాలో చాలా పాత్రలు గుర్తుండి పోతాయి. కాగా కాంతార చిత్రంలో హీరో తల్లి పాత్ర అలరించే అంశాల్లో ఒకటిగా ఉంది. ఎద్దంత కొడుకుని, అతని స్నేహితులను భయపెట్టే రెబల్ మదర్ గా ఆమె పాత్ర ఆసక్తి గొలుపుతుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా ఆమె నటన హైలెట్.
ఆ నడి వయసు పాత్ర చేసింది మాత్రం ఒక యంగ్ లేడీ. ఆమె వయసు 40 ఏళ్ళు లోపే అని సమాచారం. ఆ నటి పేరు మానసి సుధీర్. చక్కని రూపం, నాజూకు శరీరం ఆమె సొంతం. కన్నడలో అనేక సినిమాలు, సీరియల్స్ లో మానసి సుధీర్ నటించారు. పలు ప్రతిష్టాత్మక అవార్డ్స్ గెలుచుకున్నారు. ప్రొఫెషనల్ డాన్సర్ అయిన మానసి సుధీర్ గొప్ప సింగర్ కూడాను. ఆమె నటి అవుతారని ఎప్పుడూ అనుకోలేదట. మానసి తండ్రి స్నేహితుల్లో ఒకరు అమ్మాయిది మంచి హావభావాలు పలికే ముఖం. సినిమాల్లో ప్రయత్నం చేయండి అని సూచించారట.

2020 లాక్ డౌన్ సమయంలో మానసి సోషల్ మీడియా ద్వారా మరింత పాపులారిటీ సాధించారు. ఆమె కొన్ని డివోషనల్ సాంగ్స్ పాడి, నాట్యం చేశారు. ఆ పాటలు ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. ఇక మానసి సుధీర్ భర్త పేరు సుధీర్ రావు. వీరికి ఒక అమ్మాయి ఉన్నారు. కూతురు పేరు సురభి సుధీర్. కాంతార చిత్రంతో మానసి ఇమేజ్ రెట్టింపు కాగా కన్నడలో ఆమెకు పలు చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నాయట.