Bandla Ganesh- Allu Arjun: కమెడియన్ గా కెరీర్ ని ఆరంభించి ఆ తర్వాత నిర్మాతగా తనకంటూ ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న వ్యక్తి బండ్ల గణేష్..పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఈయనకి సోషల్ మీడియా లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు..పవన్ కళ్యాణ్ సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో బండ్ల గణేష్ మాట్లాడే మాటల కోసం అభిమానులు ఎంతలాగ అయితే ఎదురు చూస్తారో..ప్రేక్షకులు కూడా అంతే ఎదురు చూస్తారు..ముఖ్యంగా యూట్యూబ్ లో ఆయన ఇచ్చే పలు ఇంటర్వూస్ కి మాములు క్రేజ్ ఉండదు..ఆయన మాట్లాడే మాటలు చాలా తమాషా గా ఉంటాయి.

కానీ ఏమి మాట్లాడిన మనస్ఫూర్తిగా తన మనసులో ఏది అనిపిస్తే అది బయటకి చెప్పే స్వభావం బండ్ల గణేష్ సొంతం..ట్విట్టర్ లో ఆయన వేసే ట్వీట్స్ కూడా తెగ వైరల్ అవుతూ ఉంటాయి..లేటెస్ట్ గా ఆయన అల్లు అర్జున్ మరియు అల్లు బాబీ గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారిపోయింది.
ఇక అసలు విషయానికి వస్తే గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ లో పనిచేస్తున్న బాబీ కొడుకు పెళ్లి ఈరోజు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది..ఈ పెళ్లి కి ఇండస్ట్రీ కి సంబంధించిన అందరూ హాజరయ్యారు..వారిలో బండ్ల గణేష్ కూడా ఒకడు..ఆయన అల్లు బాబీ ని పక్కన పెట్టుకొని మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

ఆయన మాట్లాడుతూ ‘తండ్రి మాట వింటే ఇదిగో సాదాసీదా జీవితంతో మాములుగా అల్లు బాబీ గారిలా ఉంటారు..తండ్రి మాట వినకపోతే అల్లు అర్జున్ లాగ పాన్ ఇండియా స్టార్ గా ఐకాన్ స్టార్ గా మారిపోతారు..కాబట్టి తండ్రి మాట ఎవ్వరూ వినకండి’ అంటూ బండ్ల గణేష్ చాలా ఫన్నీ గా మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.