https://oktelugu.com/

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ 100 రోజుల కేంద్రాల లిస్ట్ ఇదే.. మెగాస్టార్ మాస్ విధ్వంసం

Waltair Veerayya: ‘ఆచార్య’ మరియు ‘గాడ్ ఫాదర్’ వంటి రెండు వరుస పరాజయాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఇటీవలే సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే.మెగాస్టార్ నుండి సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ కి ఈ చిత్రం ఇచ్చిన కిక్ మామూలుది కాదు. బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ […]

Written By: , Updated On : April 22, 2023 / 06:51 PM IST
Follow us on

Waltair Veerayya

Waltair Veerayya

Waltair Veerayya: ‘ఆచార్య’ మరియు ‘గాడ్ ఫాదర్’ వంటి రెండు వరుస పరాజయాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఇటీవలే సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే.మెగాస్టార్ నుండి సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ కి ఈ చిత్రం ఇచ్చిన కిక్ మామూలుది కాదు.

బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా టాలీవుడ్ లోనే ఆల్ టైం నాన్ రాజమౌళి టాప్ 2 హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.అయితే ఈ సినిమా విడుదలై నేటికి వంద రోజులు పూర్తి అయ్యింది.నిర్మాతల ప్రకారం ఈ సినిమా చీపురుపల్లి వంశీ థియేటర్ మరియు అవగడ్డ రామకృష్ణ థియేటర్ లో డైరెక్ట్ వంద రోజులను పూర్తి చేసుకుందని సమాచారం.

ఈమధ్యనే నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం కూడా వంద రోజులు పూర్తి చేసుకుంది.ఈ సినిమాకి వంద రోజుల వేడుక చేస్తామని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది.మరి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి కూడా మైత్రీ మూవీ మేకర్స్ వంద రోజుల వేడుక చేస్తుందో లేదో చూడాలి.చిరంజీవిని ఈ విషయంపై సంప్రదించామని, ఆయనకీ అందుబాటులో ఉన్న తేదీలలో శత దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపిస్తామని ఈ సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది.

Waltair Veerayya

Waltair Veerayya

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ ఏడాది ఆగస్టు 11 వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.ఇందులో కీర్తి సురేష్ చిరంజీవి కి చెల్లి గా నటిస్తుండగా, తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది .