
Samatha Counter On Chittibabu: సమంత ఫైర్ బ్రాండ్ అన్న విషయం తెలిసిందే. ఆమెను ఎవరైనా విమర్శిస్తే వెంటనే కౌంటర్ ఇస్తారు. కొన్నాళ్లుగా నిర్మాత చిట్టి బాబు సమంతను టార్గెట్ చేస్తున్నారు. యశోద మూవీ విడుదల సమయంలో సమంత తనకు మాయోసైటిస్ సోకినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన తప్పుబట్టారు. సమంత మూవీ ప్రమోషన్ కోసం నాటకాలు ఆడుతుంది సింపతీతో సినిమా ఆడించుకునే ప్రయత్నం చేస్తుంది. మయోసైటిస్ ప్రాణాంతక వ్యాధి కాదు. అందరికీ వచ్చేదే. కానీ సమంత అతి చేస్తుందని అన్నారు.
ఇటీవల శాకుంతలం మూవీ విడుదల కాగా ప్రమోషనల్ ఈవెంట్స్ లో సమంత కన్నీరు పెట్టుకున్నారు. ఇంకా ఆరోగ్యం కుదుటపడలేదన్నట్లు మాట్లాడారు. ఈ క్రమంలో చిట్టిబాబు మరోసారి సమంత మీద ఫైర్ అయ్యారు. సినిమా నచ్చితే చూస్తారు. నువ్వు ఏడ్చినంత మాత్రాన చూడరు. ప్రతిసారి ఇది వర్కవుట్ కాదన్నారు. అయినా సమంత స్టార్డం ముగిసింది. శకుంతల పాత్రకు సమంతను ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కావడం లేదు. శాకుంతలం చిత్రం మీద నాకైతే ఆసక్తి లేదన్నారు.
శాకుంతలం విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో చిట్టిబాబు మరింత రెచ్చిపోయారు. సమంతది ముసలి ముఖం. శాకుంతలం మూవీ ఆమె వలెనే ప్లాప్ అయ్యిందంటూ కామెంట్స్ చేశారు. ప్రతిసారి మౌనంగా భరించిన సమంత ఈసారి తిరిగి కౌంటర్ ఇచ్చారు. ఆమె పరోక్షంగా నిర్మాత చిట్టిబాబుకు మదం ఎక్కింది అన్నట్లు మాట్లాడారు. ‘చెవిలో వెంట్రుకలు ఎందుకు వస్తాయని గూగుల్ లో సెర్చ్ చేస్తే టెస్టోస్టిరాన్ ఎక్కువై అని రాసి ఉంది’ అని ఓ పోస్ట్ పెట్టారు.

నిర్మాత చిట్టిబాబుకు చెవులలో వెంట్రుకలు ఉంటాయి. తనను ముసలి ముఖం అన్నందుకు ఓ వ్యంగ్యమైన ఉదాహరణ సమంత పోస్ట్ చేశారు. సమంత పోస్ట్ వైరల్ అవుతుంది. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం డిజాస్టర్ అయ్యింది. రెండున్నర గంటల సీరియల్ తీశారంటూ ప్రేక్షకులు అభిప్రాయ పడ్డారు. సమంత కెరీర్లో శాకుంతలం దారుణ పరాజయంగా మిగిలిపోయింది. ప్రస్తుతం సమంత సిటాడెల్ టైటిల్ తో వెబ్ సిరీస్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండకు జంటగా ఖుషి అనే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు.