https://oktelugu.com/

Balagam : బలగం బంధాలు మందుబాబులకు ఇలా అర్థమైంది?

Balagam : మందు బాబులం మేము మందుబాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం అన్నారో సినీకవి. మద్యం తాగిన వాడు విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. దేశంలో మందు ఏరులై పారుతోంది. ప్రభుత్వాలకు మద్యమే ప్రధాన ఆదాయ వనరుగా మారుతోంది. గతంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షంలో ఉన్న జగన్ అధికారంలోకి వచ్చాక మద్యాన్ని విస్తరిస్తున్నారు. ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. తెలంగాణలో కూడా మద్యమే ప్రధాన ఆదాయంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో మద్యం తాగే వారు లేకపోతే ప్రభుత్వాల మనుగడే ప్రశ్నార్థకంలో […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 5, 2023 9:00 am
    Follow us on

    Balagam : మందు బాబులం మేము మందుబాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం అన్నారో సినీకవి. మద్యం తాగిన వాడు విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. దేశంలో మందు ఏరులై పారుతోంది. ప్రభుత్వాలకు మద్యమే ప్రధాన ఆదాయ వనరుగా మారుతోంది. గతంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షంలో ఉన్న జగన్ అధికారంలోకి వచ్చాక మద్యాన్ని విస్తరిస్తున్నారు. ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. తెలంగాణలో కూడా మద్యమే ప్రధాన ఆదాయంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో మద్యం తాగే వారు లేకపోతే ప్రభుత్వాల మనుగడే ప్రశ్నార్థకంలో పడే అవకాశముంది.

    ఇటీవల విడుదలైన బలగం సినిమా ప్రజల మనసులు గెలుచుకుంది. విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ క్రమంలో ఈ సినిమాలో ఓ సన్నివేశం మందుబాబులను ఆకర్షిస్తోంది. ఇద్దరు అన్నదమ్ములు మద్యం తాగుతూ ఉంటారు. ఓ పెగ్గు పోయిరా తమ్ముడు అంటే ఉన్నదంతా నువ్వే తాగితే నాకెట్ల అంటారు. అప్పుడే బ్యాక్ గ్రౌండ్ లో అన్నదమ్ముల అనుబంధం గురించి బుర్ర కథ వినిపిస్తుంది. అన్నంటే తండ్రి తరువాత తండ్రి అటువంటి వాడు అని చెబుతారు. దీంతో తమ్ముడు స్పందించి అన్నకు మందు పోస్తాడు. మందుబాబుల అనుబంధం గురించి సినిమాలో చూపించడం గమనార్హం.

    మద్యం గురించి మన తెలుగువారికి ఎంత ఇష్టమో తెలిసిందే కదా. సిగరెట్, మద్యం రెండు అన్నదమ్ముల వలే మనిషి ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. సిగరెట్ ఊపిరితిత్తులు, మద్యం కాలేయాన్ని పాడు చేస్తాయి. దీంతో మనిషి మనుగడే కష్టంగా మారుతుంది. అయినా వాటిని ఎవరు కూడా విడిచిపెట్టడం లేదు. మృత్యువు కబళిస్తుందని తెలిసినా మద్యం తాగడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. పొగతాగడానికే విలువ ఇస్తున్నారు. ఈ చెడు అలవాట్లను దూరం చేసుకోవాలని ఎన్ని ప్రకటనలు వస్తున్నా కనువిప్పు కలగడం లేదు.

    మద్యపానం ఓ వ్యసనంగా మారింది. నిత్యం రూ. కోట్ల మద్యం తాగుతున్నారు. కుటుంబాలు గుల్ల అవుతున్నా పట్టించుకోవడం లేదు. రోజు తాగుతూ భార్యా పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నారు. మద్యానికి బానిసై పిచ్చివాళ్లయిన వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో మద్యం ప్రభుత్వాలకు ఆసరాగా ఉన్నా వారి కుటుంబాలు మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయం. దీంతో వారి వ్యక్తిగత జీవితాలు అడకత్తెరలో పోకచెక్కలా మారుతున్నాయి. మొత్తానికి బలగం సినిమా మందు అనుబంధం గురించి చెప్పడంతో వారి జీవితాలకు అన్వయించుకుంటున్నారు.