
Bandi Sanjay Arrest: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కరీంనగర్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేశారు. కరీంనగర్లోని జ్యోతి నగర్ లో ఆయన ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు.. అయితే ఏ విషయంలో సంజయ్ ని అరెస్టు చేశారు? ఎందుకు అరెస్టు చేశారు? అనే విషయాలపై పోలీసులు స్పష్టత ఇవ్వ లేదు. తొలుత మంగళవారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన వందమంది పోలీసులు సంజయ్ ఇంటిని చుట్టుముట్టారు. తర్వాత ఆయన అరెస్టుకు ప్రయత్నించారు. సమయంలో భారీగా బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ” నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? నేను ఏం తప్పు చేశాను అని సంజయ్ అడిగితే” అదుపులోకి తీసుకునే అధికారం మాకు ఉందని పోలీసులు సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే పోలీసులను బిజెపి నాయకులు అడ్డుకున్నారు.. అక్కడ స్వల్ప తోపులాట జరిగింది.. సంజయ్ ని అరెస్ట్ చేస్తుంటే బిజెపి నాయకులు అడ్డు పడ్డారు. చివరికి రాత్రి ఒంటిగంట తర్వాత పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని తమ వెంట తీసుకువెళ్లారు.
స్థానికంగా అయితే ఇబ్బంది అవుతుందని భావించి, బిజెపి నాయకుల కళ్ళు కప్పి బండి సంజయ్ ని నల్లగొండ జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు పోలీసులు తీసుకెళ్లారు. దీంతో అక్కడ అంతా హై డ్రామా చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ ఎదుట భారీగా కార్యకర్తలు గూమి గూడటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
వాస్తవానికి నిన్న పది పరీక్షలకు సంబంధించి హిందీ ప్రశ్న పత్రం వాట్సాప్ లో ప్రత్యక్షమైంది. హనుమకొండ లోని హెచ్ఎంటీవీ మాజీ బ్యూరో చీఫ్ బూరం ప్రశాంత్ “బ్రేకింగ్ న్యూస్” అంటూ దాన్ని వైరల్ చేశాడు. అయితే దీనిని చాలామందికి ఫార్వర్డ్ చేశాడు.. ఈ క్రమంలో బండి సంజయ్ వాట్సాప్ కు కూడా రావడంతో.. ” హిందీ ప్రశ్న పత్రం లీక్ అయిందని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని” బండి సంజయ్ పేర్కొన్నారు.. అయితే ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితికి, భారతీయ జనతా పార్టీకి సామాజిక మాధ్యమాల్లో ఒక యుద్దం నడిచింది.. ఇదే సమయంలో ప్రశాంత్ ఎర్రబెల్లి దయాకర్ రావు, హైదరాబాద్ మాజ్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ లతో దిగిన ఫోటోలను బిజెపి నాయకుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బయటపెట్టారు. అయితే అంతకుముందు బండి సంజయ్ కి ప్రశాంత్ కు సంబంధం ఉందని భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రచారం చేశారు. దీనికి కౌంటర్ గా ప్రేమేందర్ రెడ్డి పలు ఫోటోలను షేర్ చేశారు.

అయితే ఈ వ్యవహారంలోనే సంజయ్ని పోలీసులు అరెస్టు చేశారని ప్రచారం జరుగుతున్నది. మరోవైపు ప్రశాంత్ ను, అతడు ఫార్వర్డ్ చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.. అయితే ఈ అరెస్టులపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.. లీకేజీల వ్యవహారంపై ప్రజలను పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం అరెస్టులకు దిగుతోందని వారు అంటున్నారు. పాత్రికేయులకు, రాజకీయ నాయకులకు సత్సంబంధాలు ఉంటాయని, వాటిని రాజకీయం చేయడం దురదృష్టకరమని బిజెపి నాయకులు వాపోతున్నారు.
మరో వైపు హిందీ ప్రశ్నపత్రం లీకేజ్ కు సంబంధించి వరంగల్ సిపి రంగనాథ్ పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.. కమలాపూర్ ప్రభుత్వ పాఠశాల నుంచి ఈ హిందీ పేపర్ లీక్ అయింది. శివ బాలుడు పరీక్ష కేంద్రంలోని రూమ్ నెంబర్ 3లోకి ప్రవేశించి, హరీష్ అనే విద్యార్థి దగ్గర పేపర్ తీసుకొని..దానిని సెల్ ఫోన్ లో ఫోటో తీసుకున్నాడు.. దానిని శివ శివ గణేష్ అనే యువకుడికి పంపించాడు. దానిని వారు ఎస్ ఎస్ సీ అనే వాట్సాప్ గ్రూప్ లో సర్క్యులేట్ చేశారు.. ఆ గ్రూపులో ఉన్న మహేష్, మాజీ బ్యూరో చీఫ్ ప్రశాంత్ ఓ మీడియా గ్రూపులో పోస్ట్ చేశారు.. అప్పటినుంచి అది వైరల్ గా మారింది. 9 గంటల 45 నిమిషాలకు పేపర్ లీక్ అయింది.. 9 గంటల 59 నిమిషాలకు ఎస్ ఎస్ సీ గ్రూపులోకి వచ్చింది.. అక్కడి నుంచి ఉదయం 10:45 నిమిషాలకు అన్ని గ్రూపుల్లోకి వెళ్ళింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి పదకొండు గంటల 30 నిమిషాలకు హిందీ పేపర్ వెళ్ళింది. పలు మీడియా ప్రతినిధులకు ప్రశాంత్ పర్సనల్.గా పంపాడు.. అంతేకాదు రెండు గంటల వ్యవధిలో 142 ఫోన్ కాల్స్ మాట్లాడాడు. అయితే అతడిపై సెక్షన్ 5 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శివ, శివ గణేష్, హరీష్, ప్రశాంత్, మహేష్ ను పోలీసులు అరెస్టు చేశారు.