Snakeless In Ireland: పాము.. ఈ మాట వింటేనే వణికిపోతాం. పాము కనిపించిందంటే భయంతో పరుగులుతీస్తాం. అయితే మనకు నిత్యం ఏదో చోట పాము కనిపిస్తునే ఉంటుంది. అసలు పాములే లేని ప్రాంతమంటూ ఉండదు. అయితే ఒక దేశంలో మాత్రం అస్సలు పాములండవట. మచ్చుకైనా ఒక్కటి కూడా కనిపించదట. అక్కడి పిల్లలకు సైతం పాములు గురించి అస్సలు తెలియదట. తల్లిదండ్రులే కంప్యూటర్, సెల్ ఫోన్లలో పాములను చూపిస్తుంటారుట. ఇంతకీ ఆ దేశం ఏదో తెలుసా? ఐర్లాండ్. ఈ ద్వీపంలో పాము అని అడిగితే అక్కడివారు బిక్కముఖం వేసి చూస్తారు.
అయితే ఇక్కడ పాములు లేకపోవడానికి అక్కడివారు అనేక కారణాలు చూపుతారు. ప్రధానంగా రెండు కథలు అక్కడ ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో ఒకటి పురాణ గాధ కావడం విశేషం. ఇక్కడ క్రైస్తవ మతం కాపాడడానికి సైంట్ పాట్రిక్ దేశం నలుమూలల నుంచి పాములను తెప్పించి సముద్రంలో విసిరేసినట్టు ఒక స్థల పురాణం ఉంది. ఇందుకుగాను ఆయన పెద్ద వ్రతమే చేపట్టినట్టు ఒక కథ ఉంది. 40 రోజుల పాటు ఏమీ తినకుండా, తాగకుండా పాములను తరిమే వ్రతం చేపట్టినట్టు అక్కడి పెద్దలు చెబుతుంటారు.
అలాగే మరో సైంటిఫిక్ కథనం కూడా ఉంది. ద్వీపంగా ఉండడంతో ఇక్కడ విపరీతమైన పాములు ఉండేవట. కానీ ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి మైనస్ డిగ్రీలకు చేరుకుంటుంది. ఈ కారణం చేత ఇక్కడ ఉండే పాములు చనిపోయావట. అందుకే అక్కడ నుంచి కనిపించకుండా పోయాయని అక్కడి శాస్త్రవేత్తలు చెబుతారు. అయితే ఐర్లాండ్ వాసులు మాత్రం పురాణ గాధనే ఎక్కువగా నమ్ముతారు. దైవశక్తి మూలంగానే ఇక్కడ పాములు కనిపించకుండా పోయాయని చెబుతుంటారు.