Rajamouli- Mahesh Babu: ఆర్ ఆర్ ఆర్ విడుదలైన తర్వాత కూడా ఏడాది పాటు బిజీగా గడిపాడు రాజమౌళి. ఆస్కార్ అవార్డు వేటలో నెలల తరబడి అమెరికాలో తిష్ట వేశాడు. పెద్ద ఎత్తున ఆ చిత్రాన్ని ప్రమోట్ చేశాడు. రాజమౌళి ప్రయత్నం కారణంగా ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ గెలుచుకుంది. గోల్డెన్ గ్లోబ్ వంటి మరో ప్రతిష్టాత్మక అవార్డు కైవసం చేసుకుంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ అనేక అంతర్జాతీయ గౌరవాలు దక్కించుకుంది. రాజమౌళి సైతం గ్లోబల్ ఫేమ్ రాబట్టారు. ఆర్ ఆర్ ఆర్ బాధ్యతల నుండి పూర్తిగా బయటపడ్డ రాజమౌళి మహేష్ మూవీ స్క్రిప్ట్ పై దృష్టి పెట్టాడు.
మహేష్ కోసం విజయేంద్రప్రసాద్-రాజమౌళి జంగిల్ అడ్వెంచర్ డ్రామా ఎంపిక చేశారు. హాలీవుడ్ సక్సెస్ఫుల్ సిరీస్ ఇండియానా జోన్స్ తరహాలో ఈ చిత్రం ఉండనుంది. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా చెప్పారు. ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా మహేష్ కనిపించనున్నారని చెప్పారు. మహేష్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాల్సి ఉంది. స్క్రిప్ట్ తుది దశకు చేరినట్లు వినికిడి. ఇక రాజమౌళి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో ఇది తెరకెక్కనుంది. రూ. 800 కోట్ల కేటాయించారని సమాచారం.
హాలీవుడ్ సాంకేతిక నిపుణులు, నటులు భాగం కానున్నారట. ఆర్ ఆర్ ఆర్ తో రాజమౌళి రేంజ్ హాలీవుడ్ స్థాయికి చేరింది. అందుకే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించనున్నారని సమాచారం. మహేష్, రాజమౌళి చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో పట్టాలెక్కనుందట. దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని విజయేంద్రప్రసాద్ చెప్పారు. ఓపెన్ ఎండ్ క్లైమాక్స్ రాశారట. కాబట్టి మహేష్ 29 మూవీ రెండు మూడు భాగాలుగా తెరకెక్కే అవకాశం లేకపోలేదు.
ఇక త్వరలో పూర్తిగా మహేష్ మూవీ పనుల్లో రాజమౌళి నిమగ్నం కానున్నాడు. అందుకే కుటుంబంలో చిన్న టూర్ ప్లాన్ చేశాడు. తమిళనాడులో గల తూతుక్కుడి రిసార్ట్స్ కి రాజమౌళి వెళ్లారు. రాజమౌళితో పాటు భార్య రమా, కొడుకు కార్తికేయ, కూతురు మయూఖ ఉన్నారు. అలాగే మరికొందరు కుటుంబ సభ్యులు జాయిన్ అయ్యారు. రాజమౌళి ఫ్యామిలీ వెకేషన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తూతుకూడి రిసార్ట్స్ లో వీరు మొక్కలు నాటారు.