Venkatesh Remake Movies: మన టాలీవుడ్ లో అత్యధిక రీమేక్ సినిమాలు చేసిన హీరోల లిస్ట్ లో విక్టరీ వెంకటేష్ పేరు ముందు వరుసలో ఉంటుంది. కెరీర్ మొత్తం మీద ఆయన 18 సినిమాలకు పైగా రీమేక్ చేసారు. అయితే ఆయన చేసిన రీమేక్ సినిమాలన్నీ కూడా ఒరిజినల్ కంటే బాగుంటాయి. ఒరిజినల్ వెర్షన్ చేసిన నటులకంటే అద్భుతంగా చేస్తారు. కానీ వెంకటేష్ హీరో గా నటించిన కొన్ని సినిమాలను వేరే భాషల్లో కొంతమంది హీరోలు చేసారు.
కానీ వెంకటేష్ రేంజ్ లో పావు శాతం కూడా చేయలేకపోయారు. అందుకే వెంకటేష్ స్పెషల్ అని అందరూ అంటుంటారు. అయితే వెంకటేష్ ఒక సాధారణ కమెడియన్ సినిమాని అప్పట్లో రీమేక్ చేసాడట. కానీ ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇంతకు ఆయన రీమేక్ చేసిన కమెడియన్ సినిమా మరేదో కాదు. అలీ హీరో గా ఎస్ వీ కృష్ణ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన ‘యమలీల’ అనే సినిమా.
ఈ చిత్రం ఆరోజుల్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. కమెడియన్ అలీ ని హీరో గా నిలబెట్టిన సినిమా ఇది. వాస్తవానికి ఈ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు తో తియ్యాలని అనుకున్నాడట డైరెక్టర్ ఎస్ వీ కృష్ణా రెడ్డి. కానీ కృష్ణ అందుకు ఒప్పుకోలేదు, వాడు పై చదువులు చదవాలి అంటూ మహేష్ ని విదేశాలకు పంపేసాడట. దీనితో ఈ చిత్రాన్ని అలీ తో చేసాడు.
సినిమా ఫలితం ఎలా ఉంటుందో అని ముందు చాలా భయపడ్డారు, కానీ ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇదే చిత్రాన్ని హిందీ లో సురేష్ బాబు నిర్మాతగా వెంకటేష్ ని హీరో గా పెట్టి ‘తక్ దీర్ వాలా’ అని రీమేక్ చేసారు. అక్కడ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు, ఈ సినిమా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది, ఎవరైనా చూడాలి అనుకుంటే చూడొచ్చు.