పాములు పగ పడుతాయా.? సినిమాల్లో అయితే పడతాయి.. కానీ వాస్తవంలో కూడా పగబట్టే పాములున్నాయా.? అంటే మన తాతల కాలం వారు ఉన్నాయంటారు. కొందరు పాము పగలపై కథలు కథలుగా చెబుతారు.. ఇప్పటికీ కొన్ని సినిమాలు పాము పగ గురించే చెబుతాయి..
Also Read: రాత్రిపూట సెల్ ఫోన్ వాడుతున్నారా.. అయితే ఈ వ్యాధి ఖాయం!
పాములకు విషయ గ్రహణ శక్తి ఎక్కువ అని.. అవి చూసి పసిగడతాయని కొన్ని పరిశోధనలు తేల్చాయి. ఇప్పటికీ మనుషులను చూసి పాములు గుర్తుపడతాయని సైంటిస్టులు తేల్చారు.. తాజాగా అమెరికాలో జరిగిన ఘటన పాము పగను మరోసారి అందరికీ పరిచయం చేసింది..
అమెరికాలోని హూస్టన్ లో ఈ ఘటన జరిగింది. జెరెమీ ర్యాడ్ క్లిఫ్ , తన భార్యతో కలిసి పెరట్లో పని చేసుకుంటుంటగా అంతలో అక్కడకు ప్రమాదకరమైన ర్యాటిల్ స్నేక్ జాతికి చెందిన పాము వచ్చింది. వెంటనే తనకు అందుబాటులో ఉన్న పారతో పామును రెండుగా నరికేశాడు జెరెమీ. చనిపోయిందనుకొని పామును బయట పారేయడానికి చేత్తో పాము తల భాగాన్ని పట్టుకున్నాడు. అంతే అప్పటివరకు చచ్చిపోయినట్టు కదలకుండా ఉన్న ఆ పాము తలతో ఒక్క ఉదుటున ఎగిరి జెరెమీ చేతిని పట్టుకొని .. దాని విషమంతా అతని శరీరంలోకి ఎక్కించేసింది.
Also Read: రూపం మార్చుకుంటున్న కరోనా వైరస్.. మరింత వేగంతో..?
పాము విషమంతా శరవేగంగా శరీరంనిండా వ్యాపిస్తుండడంతో జెరెమీని హెలీ క్యాప్టర్ లో ఆస్పత్రికి తరలించారు. సాధారణంగా పాము విషం విరుగుడుకి 4 డోసులు ఇస్తారు. జెరెమీకి మాత్రం వైద్యులు ఏకంగా 26 డోసులు విరుగుడు మందు ఇచ్చి అతికష్టం మీద బతికించారు. అయితే పాము కక్కిన విషానికి అసలు జెరెమీ బతకడని భావించామని.. కానీ ఆశ్చర్యకరంగా అతను కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. ఇలా పగ పట్టిన పాము జెరెమీపై ఎలా ప్రతికారం తీర్చుకుందనేది ఇప్పుడు సంచనలంగా మారింది.