మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ మూవీలో నటిస్తున్నాడు. కరోనాతో ఈ షూటింగ్ నిలిచిపోగా ఇటీవల తిరిగి ప్రారంభమైంది. కరోనాతో వచ్చిన గ్యాప్ లో చిరంజీవి చాలా కథలను విన్నారు. చిరంజీవికి కొందరు డైరెక్టర్లు చెప్పిన కథలు నచ్చడంతో వారితో సినిమాలు చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే వాటిపై అధికారిక ప్రకటన రాకపోవడంతో మెగాస్టార్ ఆ దర్శకులతో నటిస్తారా? లేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
Also Read: ఆ కంటెస్టెంట్ పై ‘బిగ్ బాస్’ కుట్ర.. బయట పెట్టిందెవరు? .!
‘ఆచార్య’ తర్వాత చిరంజీవి దర్శకుడు మెహర్ రమేష్ తో కలిసి ఓ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో సూపర్ హిట్టయిన ‘వేదాళం’ రీమేక్ ను తెలుగులో చిరంజీవి చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు మోహర్ రమేష్ తోపాటు డైరెక్టర్ వి.వి.వినాయక్.. బాబీలతో మెగాస్టార్ సినిమాలు చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే చిరంజీవికి దర్శకుల మధ్య క్రియేటీవ్ డిఫరెన్స్ వచ్చిందనే టాక్ విన్పిస్తోంది.
చిరంజీవి-వివి.వినాయక్ కాంబోలో ‘లూసీఫర్’ రీమేక్ తెరకెక్కుతుందని ప్రచారం జరిగింది. అయితే వినాయక్ కథలో చేసిన మార్పులు చిరంజీవికి పెద్దగా నచ్చకపోవడంతో ఈ సినిమా పక్కకు వెళ్లిందనే టాక్ విన్పిస్తోంది. అదేవిధంగా బాబీ సైతం తన కథతో చిరంజీవి మెప్పించలేకపోయారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ దర్శకులతో చిరంజీవి సినిమాలు ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం లేదనే టాక్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.
Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘ఆదిపురుష్’ రిలీజ్ డేట్ వచ్చేసిందహో..
వీరిలో కేవలం దర్శకుడు మోహర్ రమేష్ తెరకెక్కించనున్న ‘వేదాళం’ రీమేక్ కు మాత్రమే చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఆచార్య’ తర్వాత మోహర్ రమేష్-చిరంజీవి మూవీ తెరకెక్కనుందని టాక్ విన్పిస్తోంది. ప్రస్తుతం ఆచార్య షూటింగ్ చిరంజీవి లేకుండానే చిత్రీకరణ జరుపుకుంటుంది. త్వరలోనే ఈ మూవీ షూటింగులో చిరంజీవి పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మూవీలో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా రాంచరణ్ స్పెషల్ రోల్ చేస్తున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్