
Shah Rukh Khan House: ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలను చూస్తూ ఉంటే సామాన్య జనాలకు మాత్రమే కాదు, పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ కి కూడా రక్షణ కరువైంది అనే విషయం అర్థం అవుతుంది.స్టార్ హీరోల ఇళ్లలోకి దొంగలు చొరబడి, దోచుకోవడం వంటివి జరగడం కొత్తేమి కాదు, గతం లో మోహన్ బాబు మరియు జగపతి బాబు వంటి ప్రముఖుల ఇళ్లలోకి చొరబడి దోచుకున్న సందర్భాలు ఉన్నాయి.మోహన్ బాబు కి అయితే చంపేస్తాం, నరికేస్తాం జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి.
అయితే రీసెంట్ గా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ఇంట్లోకి కూడా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి దూరి దొంగతనం కి పాల్పడ్డారట.ఈ సంఘటన ఇప్పుడు బాలీవుడ్ మొత్తాన్ని కుదిపేస్తోంది, షారుఖ్ ఖాన్ లాంటి అశేష ప్రేక్షాభిమానం ఉన్న వ్యక్తికే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఇక సామాన్యుల సంగతి ఏమిటి అని ఆందోళన చెందుతున్నారు అభిమానులు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే గుజరాత్ కి చెందిన ఇద్దరు వ్యక్తులు సెక్యూరిటీ గార్డు పై దాడి చేసి షారుఖ్ ఖాన్ ఇంట్లోకి నేరుగా చొరపడ్డారు.సెక్యూరిటీ గార్డ్ అప్రమత్తంగా వెంటనే సమీపం లో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి, పోలీసులను దొంగలు ఇంట్లోకి అడుగుపెట్టిన నిమిషాల వ్యవధి లోనే తీసుకొచ్చాడు.ఆ దొంగ ని అరెస్ట్ చేసి విచారించగా ‘మేము షారుఖ్ ఖాన్ కి వీరాభిమానులం,ఎలా అయిన ఆయనని కలవాలని తాపత్రయం తో ఇంట్లోకి చొరబడ్డాము కానీ, మేము దొంగతనం చెయ్యడానికి రాలేదు’ అని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం వీళ్లిద్దరు జైలులోనే ఉన్నారు.షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ‘పఠాన్’ మూవీ గ్రాండ్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.నిన్నటితో ఈ సినిమా బాహుబలి పార్ట్ 2 వసూళ్లను దాటి, 515 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టి ఆల్ టైం బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఇప్పుడు వచ్చిన ఈ వార్త కాస్త నిరాశకి గురి చేసింది.