Electric Vahicles: ఎలక్ట్రిక్ వాహనాలకు లైసెన్స్ రిజిస్ట్రేషన్ అవసరం లేదన్నది కరెక్ట్ కాదని రోడ్డు రవాణా అధికారులు చెబుతున్నారు. 50 వాట్స్ కంటే తక్కువ ఉండే వాటికే రిజిస్ట్రేషన్ హెల్మెట్, నిబంధనలు అవసరం లేదని.. అంతకుమించిన వాటికి అన్నీ అవసరమేనని స్పష్టం చేశారు. చిన్న లూనా టైప్, స్కూటీ టైపు ఎలక్ట్రిక్ వాహనాలకు లైసెన్స్ రిజిస్ట్రేషన్ అవసరం లేదని తెలిపారు. బైక్ లో లోయెస్ట్ కెపాసిటీ ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ అవసరం లేదని చెబుతున్నారు.

ఎక్కువ కెపాసిటీ గల ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ అవసరం అని తేల్చారు. ఇక కారు లాంటి పెద్ద వాహనాలకు అయితే తప్పనిసరి అని సూచించారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాలకు గ్రీన్ కలర్ ఎందుకు వేస్తారో కూడా ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. గ్రీన్ కలర్ అంటే ‘నాన్ పొల్యూటెడ్’ కాలుష్య రహితం అని అర్థం వచ్చేందుకే గ్రీన్ కలర్ వేస్తారని గుర్తు చేశారు.
Also Read: తెలంగాణలో ‘ముందస్తు ఎన్నికల’ ఊహాగానాలు!? కేసీఆర్ లొల్లికి కారణమదే?
వాహనాలకు కాలపరిమితి ఎందుకు ఉంటుందో కూడా వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో 15 సంవత్సరాల కాలపరిమితి ఒక వాహనానికి ఉంటుందని.. కానీ కాలుష్యం ఎక్కువ ఉన్న ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో దాని కాలపరిమితి 10 ఏళ్లేనని వివరించారు.
టు వీలర్, 4 వీలర్ లైసెన్స్ లు క్లబ్ చేసుకొని ఒకటే లైసెన్స్ తీసుకోవాలని.. రెండు లైసెన్స్ లు ఉంచుకోవడం నేరం అని.. ఒకటి సరెండర్ చేసి రెండూ కలిపి తీసుకోవాలని ఆర్టీఏ కమిషనర్ వివరించారు. ఇక విదేశాల నుంచి దిగుమతయ్యే వాహనాలను పట్టుకోవడం.. వాటిని అందుకోవడం కష్టమన్నారు. 100 కి.మీల స్పీడుతో వెళ్లే విదేశీ వాహనాలను అందుకోవడం ఆర్టీఏ అధికారులకు సాధ్యం కావడం లేదని..వాటిని పట్టుకొని ఫైన్లు వేస్తామని వివరించారు.
Also Read: సీఎం జగన్ ను తప్పుదోవ పట్టించాడా? ప్రవీణ్ ప్రకాష్ బదిలీతో వాళ్లు ఎందుకు పండుగ చేసుకుంటున్నారు?
విదేశాల నుంచి ఖరీదైన కార్లు తీసుకునే వారు తప్పనిసరిగా ట్యాక్సులు కట్టాలని.. తెలియక కట్టని వారు వెంటనే కట్టాలని ఆర్టీఏ కమిషనర్ తెలిపారు. నెల తర్వాత కడితే 2శాతం వడ్డీతో భరించాల్సి వస్తుందని హెచ్చరించారు.
Also Read: రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలను చుట్టుముట్టిన పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం