International Women’s Day 2023: వాళ్లంతా రంగుల ప్రపంచంలోని హీరోయిన్లు. అందాన్నే పెట్టుబడిగా పెట్టి సినిమాల్లో రాణించారు. బ్యూటీని నమ్ముకున్న వీరికి కలలో కూడా ఊహించిన భయంకర జబ్బులు వచ్చాయి. కొందరు చావు చివరి అంచుల్లోకి వెళ్లారు. కానీ ఏమాత్రం భయపడకుండా ఎంతటి కష్టాన్నైనా జయించగలమనే నమ్మకంతో ముందుకు వెళ్లారు. మొత్తంగా తమకు వచ్చిన వ్యాధులను జయించారు. సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్ లో నూ ఆదర్శంగా నిలుస్తున్నా ఈ హీరోయన్ల గురించి ఇండస్ట్రీ అంతా చర్చించుకుంటోంది. అయితే వీరు తమ వ్యాధులను ఎదుర్కోవడానికి అందరూ ఒకే మంత్రం జపించారు. అదే ధైర్యం.. ఉమెన్స్ డే సందర్భంగా వీరి కథ మీకోసం
Also Read: Nandamuri Family: పేరు గొప్ప ఊరు దిబ్బ… నందమూరి కుటుంబంలో ప్రపంచానికి తెలియని చీకటి కోణాలు ఎన్నో!
సుస్మితా సేన్:
ఇటీవల సోషల్ మీడియాలో తాను చావు చివరి అంచుల్లోకి వెళ్లానని, కానీ మీరు చూపిన ప్రేమతోనే నేను ప్రమాదాన్ని ఎదుర్కొన్నానని ప్రముఖ నటి సోనాలి బింద్రే తెలిపారు. ఆమె గుండె పోటుకు గురై ప్రధాన రక్త నాళం 95 శాతం మూసుకుపోయినట్లు ఈ సందర్భంగా ఆమె చెప్పారు. అయినా ధైర్యంగా చికిత్స తీసుకున్నా అని చెబుతోంది. ఎప్పుడూ సంతోషంగా ఉంటే ఆరోగ్యం మరింత హాయిగా ఉంటుందిన సోనాలి బింద్రే చెబుతున్నారు.
సమంత:
ఓ వైపు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ సినిమాల్లో బిజీగా ఉన్న సమంత ఒక్కసారిగా ఆసుపత్రిలో చేరిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. తనకు మయోసైటిస్ అనే వ్యాధి ఉంది ఉందని చెప్పింది. ఒక రకంగా ఇది ప్రాణాంతక వ్యాధి. కానీ సమంత ఏమాత్రం జడవలేదు. చికిత్స తీసుకొని ప్రస్తుతం కోలుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నా జీవితంలో అటు మానసికంగా.. ఇటు శారీరకంగా ఎన్నో భయంకర రోజులు చూశాను. ఒక్కో రోజు ఎలా గడుస్తుందోనని భయపడ్డాను. కానీ నాపై మీరు చూపిన ప్రేమే ఎంతో శక్తినిచ్చిందని నెటిజన్లను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యలు చేశారు.
హంసానందిని:
హంసానందిని గురించి తెలియని వారుండరు. అందచందాలతో ఆకట్టుకునే ఈ అమ్మడు రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. దీంతో ఆమెకు గ్రేడ్-3 చికిత్స చేశారు. భవిష్యత్ లో ఈ వ్యాధి రాదని వైద్యులు చెప్పినా.. మరోసారి చేసిన పరిక్షలో పాజిటివ్ అని తేలింది. దీంతో తన జీవితం ముగిసినట్లే అని భావించింది. అయితే వైద్యులు ఈ వ్యాధి నుంచి బయటపడాలంటే కొన్ని రోగ నిరోధక శస్త్ర చికిత్సలు చేయించుకోవాలని సూచించారు. మొత్తానికి ఆమెకు చేసిన చికిత్సలు విజయవంతం కావడంతో పెద్ద గండం నుంచి బయటపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిరునవ్వు, ఆత్మ విశ్వాసంతో ఈ మహమ్మారిని గెలవాలనుకున్నా.. గెలిచా.. అని సంతోషం వ్యక్తం చేశారు.
మమతా మోహన్ దాస్:
మరో నటి మమతా మోహన్ దాస్ లింప్ నోడ్స్ పై ప్రభావం చూసే క్యాన్సర్ కు గురి కావడంతో కలత చెందినట్లు తెలిపింది. ఈ వ్యాధిని జయించడానికి ఆమె ఏడేళ్లు శ్రమించారు. ప్రతీ విషయంలో సానుకూలంగా ఆలోచించడం తప్ప నేనేం చేయలేదు. కానీ అలాంటి పాజిటివ్ వాతావరణంతో పాటు నా చట్టూ ఉన్న బంధువులు నాకు ధైర్యం చెప్పారు. అదే నన్ను కాపాడిందని మమతా చెబుతున్నారు.
సొనాలి బింద్రే:
మెటాస్టాటిక్ క్యాన్సర్ కు గురైన సోనాలి బింద్రే తన జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు మనకు రెండు జీవితాలు ఉన్నాయని అనుకోవాలని ఈ సందర్భంగా చెప్పారు. మన జీవిత ప్రయాణం ఎప్పుడూ ఆగిపోకూడదని, ధైర్యంగా ఎదుర్కోవాలని చెబుతున్నారు.
శృతిహాసన్:
ఏ రంగంలోనైన వారికి తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉంటుంది. అయితే ఇతరులతో ప్రేమగా మాట్లాడితే ఆ భారం తగ్గుతుంది. నాకు వచ్చిన సమస్యలతో ఎన్నోసార్లు షూటింగ్ లో పాల్గొనలేకపోయా. దీంతో మానసిక వైద్యులకు వెళ్లాల్సి వచ్చింది. అయితే చికిత్స తీసుకోవడంతో పాటు ఆనందంగా ఉండడమే ఈ ఒత్తిడి నుంచి బయటపడాల్సి వచ్చింది. అందువల్ల ఎదుటివారితో మనసు విప్పి మాట్లాడడం ద్వారా ఎలాంటి ఆందోళన ఉండదు… అని శృతి చెబుతున్నారు.
Also Read:Revanth Reddy- Gangavva: గంగవ్వ ప్రేమకు ఫిదా అయిన రేవంత్రెడ్డి!
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: These heroines overcame their critical health issues and won careers
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com