Grandhi Kiran Kumar : అయితే సుమన్ వేలం నెగ్గానని భుజాలు తడముకుంటాడు. మార్కెట్ ధర ప్రకారం.. ఆ భవనం తక్కువ పలుకుతుంది. కానీ హీరో వెంకటేష్ తన ప్రత్యర్థి సుమన్ పై చేయి సాధించాలని.. అతడికి ఆర్థికంగా నష్టం చేయాలని ఆ ప్రణాళిక పన్నుతాడు.. అందులో విజయం సాధిస్తాడు. ఇలాంటి ప్రణాళికే ఇప్పుడు ఓ తెలుగు వ్యాపారి కూడా అమలు చేస్తున్నారు. రెండు రోజులపాటు జరిగిన ఐపిఎల్ వేలంలో ఆయన ఈ విధానాన్ని అనుసరించి విజయవంతం అయ్యారు. అయితే ఆయన వేలకోట్లకు అధిపతి అయినప్పటికీ.. పెద్దగా ప్రచారాన్ని కోరుకోరు. ఆయన చూడ్డానికి పెద్ద మనుషులా ఉంటారు.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు యజమానిగా ఉన్నారు. అయితే ఆయన తెలుగు వ్యక్తి కావడం విశేషం.. ఇంతకీ ఆ వ్యక్తి పేరు ఏంటంటే గ్రంథి కిరణ్ కుమార్.. గ్రంధి మల్లికార్జునరావు కుమారుల్లో ఒకరు.. గ్రంధి మల్లికార్జునరావు దేశవ్యాప్తంగా కానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జిఎంఆర్ పేరుతో విమానాశ్రయాలను నిర్వహిస్తున్నారు. జాతీయ రహదారులను నిర్మిస్తున్నారు. గ్రంధి మల్లికార్జున రావు కుమారుడే గ్రంధి కిరణ్ కుమార్. ప్రస్తుతం ఈయన ఢిల్లీ జట్టుకు యజమానిగా ఉన్నారు..
ఇదీ ఆయన వ్యాపార శైలి..
గ్రంధి కిరణ్ కుమార్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు యజమానిగా ఉన్నారు. ఐపీఎల్ వేలం సమయంలో ఒక ఆటగాడి కోసం విపరీతమైన పోటీ ఏర్పడిన నేపథ్యంలో.. ప్రత్యర్థి టీం లో కావాలని కిరణ్ కుమార్ రెచ్చగొడతారు. అలా ధర పెంచి ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు. అత్యంత తెలివిగా పోటీ నుంచి వెనక్కి వెళ్తారు. దీంతో ఒక స్థాయి ధరకు అమ్ముడు పోవాల్సిన ఆటగాడు.. భారీ ధరకు వెళ్ళిపోతాడు. అంతేకాదు ఇలా చేసి అవతలి జట్టు పర్సు మొత్తాన్ని కిరణ్ కుమార్ ఖాళీ చేస్తారు. ఇప్పుడే కాదు గతంలో అనేకసార్లు కిరణ్ కుమార్ ఇదే స్ట్రాటజీ అమలు చేశారు. ఇక ఇటీవల ఐపీఎల్ వేలంలో కూడా శ్రేయస్ అయ్యర్ కోసం గ్రంధి కిరణ్ కుమార్ రంగంలోకి దిగారు. పంజాబ్ జట్టు పర్సును 26.7 కోట్లకు ఖాళీ చేయించారు. ఐపీఎల్ చరిత్రలో ఇదొక సంచలనంగా మారింది. అయితే 26.7 కోట్లకు శ్రేయస్ అయ్యర్ పంజాబ్ జట్టుకు వెళ్ళిపోగా.. రిషబ్ పంత్ 27 కోట్లకు లక్నోకు వెళ్లిపోయాడు.. అర్ష్ దీప్ సింగ్ విషయంలోనూ గ్రంధి కిరణ్ కుమార్ ఇదే విధానాన్ని అనుసరించారు. అతడిని ఏకంగా 18 కోట్ల వరకు తీసుకొచ్చాడు. చివరికి సైడ్ అయిపోయాడు. స్టార్ ఆటగాడు స్టార్క్ ను మాత్రం కేవలం 11.75 కోట్లకే కొనుగోలు చేశాడు. గత సీజన్ లో స్టార్క్ ను కోల్ కతా జట్టు భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే..
ఢిల్లీ జట్టుకు సహ యజమాని
గ్రంధి కిరణ్ కుమార్ ప్రస్తుతం ఢిల్లీ జట్టుకు సహ యజమానిగా ఉన్నారు. గ్రంధి కిరణ్ కుమార్ గాంధీ మల్లికార్జున్ రావు చిన్న కుమారుడు. 1999 నుంచి జిఎంఆర్ గ్రూప్ బోర్డులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో జిఎంఆర్ గ్రూప్ నిర్మించే ప్రాజెక్టులలో కిరణ్ కుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్వహణ బాధ్యత జిఎంఆర్ గ్రూపుకు దక్కేలా చేయడంలో కిరణ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. జిఎంఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్, ఢిల్లీ, ఇస్తాంబుల్, మాలే వంటి విమానాశ్రయాలు ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా 12000 కిలోమీటర్ల హైవేల నిర్మాణంలో గ్రంధి కిరణ్ కుమార్ ముఖ్య పాత్ర పోషించారు. ఇక కొంతకాలంగా క్రీడారంగం వైపు జిఎంఆర్ గ్రూపును మళ్లించారు.. ఇందులో భాగంగానే ఢిల్లీ జట్టును కొనుగోలు చేశారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Grandhi kiran kumar implements strategy in delhi capitals team owner auction
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com